సాంబార్ ఉచితంగా ఇవ్వలేదని ఒక హోటల్‌కు పోలీసులు రూ.5,000 జరిమానా విధించడం తమిళనాడులోని కాంచీపురంలో వివాదానికి దారితీసింది. గత శుక్రవారం.. కాంచీపురం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న హోటల్‌కు వెళ్లిన ఒక కానిస్టేబుల్.. సాంబార్ ఉచితంగా ఇవ్వాలని కోరాడు. అందుకు హోటల్ నిర్వాహకులు నిరాకరించగా.. వారికి, కానిస్టేబుల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది.
కానిస్టేబుల్ సూచనతో ఎస్‌ఐ..
శనివారం ఆ ప్రాంతానికి చెందిన ఎస్‌ఐ రాజమాణికమ్, కానిస్టేబుల్‌తో కలిసి.. హోటల్‌కు వెళ్లి కొవిడ్ నిబంధనలు పాటించడంలేదని రూ.500 జరిమానా విధించారు. కానిస్టేబుల్ జోక్యం చేసుకుని రూ.5,000 జరిమానా వేయాలని ఎస్‌ఐకి సూచించాడు. కానిస్టేబుల్ సూచన మేరకు కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద రూ.5వేలు జరిమానా విధించారు ఎస్‌ఐ.
పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన హోటల్ యజమాని.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.
ఇదీ చూడండి:మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం