Horoscope Today: ఈరోజు (08-12-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం హేమంత రుతువు; మార్గశిర మాసం
శుక్లపక్షం పంచమి: తె. 3.11 తదుపరి షష్ఠి శ్రవణం: తె. 4.41 తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: ఉ. 9.35 నుంచి 11.06 వరకు అమృత ఘడియలు: సా.6.45 నుంచి 8.16 వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.30 నుంచి 12.14 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.6.22, సూర్యాస్తమయం: సా.5-22

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

కీలక నిర్ణయాలను అమలు చేసేముందు బాగా అలోచించి ముందు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీ గణపతి సందర్శనం శక్తినిస్తుంది.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాల్లో సమయోచితంగా స్పందించి అధికారుల మెప్పు పొందుతారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిశ్రమకాలం. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మీమీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది.

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది.

మంచి ఆలోచనలతో పనులను ప్రారంభిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్నిస్తాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

బాగా ఆలోచించి పనులను చేయాలి. మిత్రులతోకలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచి ఫలితాలనిస్తుంది

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. యుక్తితో ఎంతటి కార్యాన్నైనా అసంపూర్ణంగా వదలకుండా పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వెంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధుమిత్రులను కలుస్తారు. దత్తాత్రేయ స్తోత్రం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మి సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.