HOROSCOPE TODAY: ఈరోజు (అక్టోబర్ 29) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.
శ్రమ పెరిగినప్పటికీ సంతృప్తికరమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. మహాలక్ష్మీ సందర్శనం శుభప్రదం.
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.
మీ ప్రతిభకు, పనితీరుకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయభేదాలు రానీయకండి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి.
చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. కొన్ని విషయమాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎవ్వరితోనూ విభేదించకండి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన చేస్తే మంచిది.
మానసికంగా ద్రుఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల వైఖరి మీపట్ల మిశ్రమంగా ఉంటుంది. ఆంజనేయ సందర్శనం మంచిది.
అవసరానికి తగిన సహాయం అందుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ఇష్టదైవారాధన శుభప్రదం.
అనుకూలమైన ఫలితాలున్నాయి. మీ భుజాన కొత్త బాధ్యతలు పడతాయి. వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే బాగుంటుంది.
బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి .అవసరానికి తగిన సహకారం అందుతుంది. మీ సొంత విషయాలపై ఇతరుల ప్రభావం లేకుండా చూసుకోవాలి. శ్రీ విష్ణు ఆరాధన మంచిది.
ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. కీలక విషయాల్లో చురుగ్గా పనిచేస్తుంది. మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ముఖ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకండి. శివ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.