Horoscope Today : ఈ రోజు (మే 19) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఉత్సాహంతో మీ రోజును ప్రారంభిస్తారు. మానసిక, శారీరక స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం కూడా ఆనందభరితంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారిని మీరు కలుసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత ఆరోగ్యంలో కొన్ని మార్పులు జరిగింది.

గందరగోళంగా ఉండే మీ మానసిక స్థితి మరింత ఇబ్బందిపెడుతుంది. జలుబు, జ్వరంతో మీరు బాధపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేసే అవకాశాలున్నాయి. మీరు మీ ప్రియమైన వ్యక్తులతో విడిపోతారు. కాన ఈ సమస్యల నుంచి మధ్యాహ్నం తర్వాత ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత మీరు చక్కగా మీ పనిని కొనసాగిస్తారు.

మీ స్నేహితుల ద్వారా మీరు ఈరోజు లబ్ధి పొందుతారు. భవిష్యత్‌లో మీకు సాయపడగలిగే వ్యక్తులతో మీరు స్నేహం చేస్తారు. డబ్బు పరంగా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లబ్ధి పొందుతారు. ఈరోజు ఏదైనా ప్రయాణం కూడా పెట్టుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుతుంది.

వ్యక్తిగత, వృత్తిరీత్యా వ్యవహారాల గురించి ఈరోజు మీరు చర్చిస్తారు. దీంతో ఈరోజు మీకు చక్కగా గడుస్తుంది. అధిక పనిభారం మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది. కానీ మధ్యాహ్నం తర్వాత కొంచెం ఉపశమనం లభించవచ్చు. ఈరోజు మీరు మీ స్నేహితులను కలుసుకునే సూచనలున్నాయి.

ఈరోజు మీరు మానసికంగా, శారీరకంగా అలసటకు గురవుతారు. అనవసరమైన గొడవలు, వివాదాలు ఏర్పడకుండా చూసుకునేందుకు మీరు మీ దూకుడును నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులతో గొడవలు పెట్టుకుంటే మీ చుట్టూ వాతావరణం అంతా చెడిపోతుంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఉపశమనం లభిస్తుంది.

తీవ్రమైన ఆలోచన చేయాలనే కోరిక ఈరోజు మీలో కలుగుతుంది. ప్రకృతి వైపు ఆకర్షితులయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి. వివాదాలు ఏర్పడకుండా ఉండేందుకు మీ మాటలను అదుపులో పెట్టుకోండి. మీ ఆరోగ్యం కూడా స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది. మధ్యాహ్నం తర్వాత మీరు ఏదైనా ప్రయాణం పెట్టుకోండి. ఈరోజు ఏదైనా శుభకార్యం తలపెడితే అది మీరు పూర్తి చేయలేరు.

ఈరోజు మీరు ఉదయం లేచినప్పటి నుంచి మీకు చాలా బాగుంటుంది. ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితి ఎంతోసేపు కొనసాగదు. మీ మనసులో ఆలోచనలు రైలు బండిలా పరిగెడుతుంటాయి. మీరు ఉదయం నుంచి ఒకటే ఆలోచనలో ఉంటారు. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఊహించని చేదు అనుభవాలు ఏర్పడవచ్చు. మీ శత్రువులు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. సమయం అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీరు కొత్త పనులను ప్రారంభించకపోవడం మంచిది. ఈరోజు ఆర్థిక లాభాలు కలిగి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

ఈ రోజంతా మీరు మేథోపరమైన, సామాజిక పరమైన చర్చల్లో పాల్గొంటారు. ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవడానికి మీకు ఇది మంచి సమయం. సాయంత్రం నుంచి మీకు అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతోనూ బయటికి వెళ్లి ఆనందంగా గడపడానికి మంచి సమయం. వారితో విందు భోజనాల్లో పాల్గొంటారు. ఈ సమయాన్ని వృథా చేయకుండా ఆనందంగా గడపండి.

ఈరోజు మీ ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కానీ దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నందున సహనంతో ఉండండి. నిరాశకు లోను కాకండి. మీ ప్రయాణాలను వచ్చే వారానికి వాయిదా వేసుకుంటే మంచిది. మధ్యాహ్నం నుంచి మీ తారాబలం బాగుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికపరంగా కానీ, ఇతర విషయాల పట్ల మీ దృక్పథం కానీ, అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. సాయంత్ర సమయంలో మంచి సంగీతంతో ఆనందించండి.

మరి ఎమోషనల్, సెంటిమెంటల్‌గా ఉండకండి. ఆస్తులు, భూములకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండండి. మానసికంగా మీకు చికాకుగా అనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వహించండి. మొండిగా ఉంటే మీకు ప్రయోజనం ఉండదు కాబట్టి పట్టువిడుపుల ధోరణిని అవలంబించండి.

కొత్త పనులు చేపట్టేందుకు ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. కానీ ఆ ఆలోచనలు వేగంగా మారిపోతాయి. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రచయితలకు ఇది మంచి సమయం కానీ మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత పరిస్థితుల్లో మార్పు రావచ్చు.

కుటుంబ జీవితాన్ని పట్టించుకోకుండా పూర్తిగా పనిలోనే నిమగ్నమైన విషయాన్ని మీరు ఎట్టకేలకు గుర్తిస్తారు. దాన్ని చక్కదిద్దుకునేందుకు మీరు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. బయటకు వెళ్లి భోజనం చేయడం లేదా సినిమా లేదా షాపింగ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.