Horoscope Today August 3rd : ఈ రోజు (ఆగస్టు 3) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
![](https://assets.eenadu.net/article_img/mesham_2_4.jpg)
మీ స్నేహితులతో కలిసి గడపడానికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు కానుకలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కొత్త స్నేహితులు మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటారు. మీ పిల్లలు కూడా మీ సంపదను పెంచుతారు. ఒక మనోహరమైన ప్రదేశానికి పర్యటనకు వెళ్లడానికి అవకాశం ఉంది.
![](https://assets.eenadu.net/article_img/vrushabam_5.jpg)
ఈరోజు ఉద్యోగులకు అదృష్టకరంగా ఉంటుంది. కొత్త పనులకు విజయవంతమైన ముగింపు లభిస్తుంది. మీ పై-అధికారులు అనుకూలంగా ఉంటారు. మీకు ఒక పదోన్నతి లభించే ఛాన్స్ ఉంది. గృహ జీవితంలో ఆనందంగా ఉంటారు. అసంపూర్ణ పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు.
![](https://assets.eenadu.net/article_img/midhunam_5.jpg)
రెండు రోజులుగా మీకు ఉన్న నీరసం, సోమరితనం ఈరోజు కూడా కొనసాగుతుంది. మీకు మీరుగా ఒత్తిడికి లోనై నీరసిస్తారు. మీ సమస్యకు మీ పిల్లలు కారణం కావచ్చు. మీరు ఇంటి వద్ద ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించవద్దు. మీకు డబ్బు సంబంధమైన సమస్యలు ఉండటం వల్ల పనులు జరగవు. మీరు ఒకవేళ పనిచేయడానికి వెళితే మీ సహోద్యోగులు మిమ్మల్ని అనవసరంగా నిందిస్తారు.
![](https://assets.eenadu.net/article_img/karkatakam_2_4.jpg)
ఈరోజు మీకు ప్రతికూలంగా ఉండవచ్చు. మీరు శక్తి, ఉత్సాహం లేకుండా ఉండవచ్చు. మీరు నిరుత్సాహాన్ని, నిరాశావాదాన్ని దూరంగా ఉంచితే మీకు మంచిది. మీ దూకుడును నియంత్రించడానికి ప్రయత్నించండి. ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి.
![](https://assets.eenadu.net/article_img/simham_1_4.jpg)
మీ సంభాషణ, సృజనాత్మక సామర్థ్యాలు మీ ఆయుధాలు. మీ జీవితంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంటాయి. అయితే ఒత్తిడి లేనప్పుడే మీ సృజనాత్మకత వికసిస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/kanya_1_4.jpg)
బాగా ప్రభావితం చేసే ఓ మిత్రుడు మీకు అదృష్టంగా మారతారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. మీ సామర్థ్యం, కఠిన శ్రమకు ప్రశంసలు దక్కుతాయి.
![](https://assets.eenadu.net/article_img/tula_1_4.jpg)
మీరు మీ బాస్ కోపాన్ని చవి చూస్తారు. మీ తోటి ఉద్యోగులు కూడా మీకు అన్యమనస్కంగానే సహకారం అందిస్తారు. కెరీర్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు ఇంటర్వ్యూల్లో విజయాలు ఆలస్యమవుతాయి.
![](https://assets.eenadu.net/article_img/vruschikam_6.jpg)
మాటల్లో జ్ఞానం, చేతుల్లో నాయకత్వం - ఈ రోజు మీ తీరు ఇలా ఉంటుంది. పని ప్రదేశంలో జీతం పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో హోదా మెరుగుదలకు సంబంధించిన శుభవార్త వింటారు. అకౌంటెంట్లు, ఫ్రాంచైజీలు ఈ రోజు చక్కని లాభాలు అందుకుంటారు.
![](https://assets.eenadu.net/article_img/dhanussu_5.jpg)
మీరు మీ ప్రత్యర్థులను, పోటీదారులను అణగదొక్కదానికి అవకాశం ఉంది. మీరు మానసికంగా, శారీరకంగా బలహీనంగా, బద్దకంగా భావిస్తారు. మీరు ఏదో ఒక కొత్త దానికోసం ప్రణాళిక చేస్తున్నారు. దానిని అమలుచేయడానికి ఇదే మంచి సమయం. మీరు మీ స్నేహితులతో గడుపుతూ ఆప్యాయతను పంచుకుంటూ ఉండవచ్చు. ఒక ఆనందకరమైన, ఆధ్యాత్మికతతో కూడిన రోజు ఇది.
![](https://assets.eenadu.net/article_img/makaram_3_3.jpg)
ఈ రోజు మీకు అంత ఉత్తమంగా ఉండకపోవచ్చు. ప్రార్థన, ధ్యానం సహాయం చేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, అనారోగ్యం మిమ్మల్ని అస్థిరతతో, అసంతృప్తితో ఉంచుతాయి. వృథా ఖర్చులు మీ సమస్యలకు తోడవుతాయి. మీ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోండి. విద్యార్థులు తమ చదువులపై దృష్టి కేంద్రీకరించడానికి మొగ్గుచూపకపోవచ్చు.
![](https://assets.eenadu.net/article_img/kumbam_1_5.jpg)
మీరు రోజంతా సంతోషంగా ఉంటారు. సరదాగా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్తారు. ఫలితాల్లో మీరు చాలా స్పష్టత కలిగి ఉంటారనీ, ఆధ్యాత్మిక జీవితంలో పై స్థాయికి వెళతారనీ ఉంది. స్నేహితులు, బంధువులూ బహుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రతికూల వైఖరిని పక్కన పడేయడం మంచిది. వైవాహిక జీవితం మీకు ఆనందమయంగా గడుస్తుంది.
![](https://assets.eenadu.net/article_img/meenam_2_5.jpg)
ఈరోజు ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మీరు ఇతర విషయాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రియమైనవారి నుంచి స్వల్పకాలిక విరహానికి అవకాశం ఉంది. వివాదాలు, మనస్పర్థలకు చాలా అవకాశం ఉంది జాగ్రత్త.