Horoscope Today 15th August 2023 : ఈ రోజు (ఆగస్టు 15) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మీరు చాలా సున్నితంగా ఉంటారు. మీరు తరచు బాధపడతారు కాబట్టి నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అనేక విషయాలు ఉంటాయి. ముఖ్యంగా మీ తల్లి ఆరోగ్యం. ధ్యానం, యోగాభ్యాసం ద్వారా మీకు కొంత ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి మీ ఇల్లు లేదా ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం (Taurus) : ఆందోళన, ఒత్తిళ్లు ఈ రోజు మిమ్మల్ని చుట్టుముడతాయి. కానీ అవన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం మీరు సాయంత్రం ఓ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఈ రోజు చాలా సృజనాత్మకంగా వ్యవహరిస్తారు.
మిథునం (Gemini) : బయటకు వెళ్లండి. జనాలు, స్నేహితులు, బంధువులతో కలవండి. ఇవన్నీ మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రారంభంలో మీకు ఆర్థికపరంగా కొన్ని చిక్కులు ఏర్పడతాయి. కానీ రోజు గడుస్తున్న కొద్ది అవి సమసిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీంతో మీరు ప్రశాంతంగా ఫీలవుతారు.
కర్కాటకం (Cancer) : ప్రేమ వ్యాపించి ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉండండి. ఈ రోజంతా అనేక ఆశ్చర్యాలను మీరు చూస్తారు. అవి స్నేహితులు, బంధువులు లేదా మీ భాగస్వామి నుంచి ఎదురవ్వచ్చు. మీ ప్రియమైన వారితో అందమైన ప్రదేశాల్లో మీకిష్టమైన ఆహారపదార్థాలు తింటూ ఈ రోజు ఆనందంగా గడుపుతారు.
సింహం (Leo) : ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు అనుకూలంగా లేని భావోద్వేగాల ప్రభావం మీపై ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయండి. తారాబలం బలహీనంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి.
కన్య (Virgo) : మీ ఎదురుచూపులకు ముగింపు పలికే సమయం వచ్చింది. ఈ రోజు మీకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు సంపద కలుగుతుంది. ప్రశాంతమైన ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో మీరు మీ స్నేహితులకు, భాగస్వామికి మరింత దగ్గరవుతారు.
తుల (Libra) : ఇంట్లో ఆనందకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. మీ శక్తియుక్తులతో మీ ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ కోసం చూస్తున్న ఎదురుచూపులకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. ఉరకలెత్తించే సంతోషం మీ ఇంటిని ఉత్సాహభరితంగా మార్చుతుంది.
వృశ్చికం (Scorpio) : ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. పనిప్రదేశంలో పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి. అయినప్పటికీ ఆఫీసర్లు లేదా ఉన్నతాధికారుల మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. పిల్లలు, సమకాలీకులతో వాదనలకు దూరంగా ఉండండి.
ధనుస్సు (Sagittarius) : ఊహించని సంఘటనలు, ఘటనలు ఈ రోజు సంభవిస్తాయి. మీరు తీరిక లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు తలెత్తే సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయకండి. అధిక సున్నితత్వ స్వభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ భాగస్వామితో మెలిగేటప్పుడు లౌక్యంగా ఉండండి. గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించండి.
మకరం (Capricorn) : వివిధ ఉత్పత్తులకు సంబంధించిన ఫ్రాంచైజీలు మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కమిషన్, వ్యాపారం, వడ్డీ, రుణాలు, పెట్టుబడులు మీ ఆదాయాన్ని పెంచుతాయి. భారీ లాభాలను మీరు చూడబోతున్నారు. పిల్లల చదవులు కొంత ఆందోళన కలిగిస్తాయి.
కుంభం (Aquarius) : ఈ రోజు మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. మీ స్టైల్, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు సంతృప్తి, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ మానసికస్థితి ఆలోచనలకు దారితీసేదిగా ఉంటుంది.
మీనం (Pisces) : ఈ రోజు విద్యార్థులకు శుభసూచకంగా ఉంది. తారాబలం బలంగా ఉంది. వారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రోజువారీ పనులను పక్కనపెట్టండి. సృజనాత్మకంగా మీరు ప్రస్తుతం ఉన్నతస్థితిలోనే ఉంటారు.