Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 15) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లోశుభకార్యం గురించి చర్చకి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని ముందడుగు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గ స్తోత్రం పఠించాలి.
చేపట్టే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. మీ పనిలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హ్రుదయం పఠిస్తే బాగుంటుంది.
శుభకాలం. బుద్ధిబలాన్నే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రుతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
మీ మీ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేవిధంగా ముందుకుసాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏపని తలపెట్టినా వెంటనే పూర్తిచేస్తారు. సంకల్పసిద్ధి ఉంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు.
ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.
చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.