HOROSCOPE TODAY: ఈరోజు (నవంబర్ 10) మీ రాశిఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
మీ విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ఇష్టదైవ నామస్మరణ మంచిది.
శ్రమ అధికం అవుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆవేశాలకు పోకూడదు. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. పనులలో విజయం కోసం నవగ్రహధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
శుభ సమయం. మనఃస్సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
శుభకాలం. అనుకున్న పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకాన్ని చదివితే అన్ని విధాలా మంచిది.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యానశ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ శుభప్రదం.
ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
చేపట్టే పనిలో ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మనఃపీడ పెరుగుతుంది. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.శివారాధన శుభప్రదం.