Horoscope Today January 15th 2024 : జనవరి 15న (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇవాళ మిమ్మల్ని అభద్రతా భావం వెన్నాడుతుంది. ఇంట్లో ఏదో తెలియని అశాంతి, ఆందోళనలు ఆవరించి ఉంటాయి. సన్నిహితులపైనే మీకు అనుమానాలు కలుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందిపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారికి బాగానే ఉంటుంది. కుటంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటారు. దీనికోసం ప్రణాళిక కూడా వేసుకుంటారు. త్వరలో మీ కోరిక నెరవేరుతుంది. ఆరోగ్యం ఫర్వాలేదు. ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త వహించండి.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారు ఏకాగ్రతతో పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల పట్ల అమితమైన నిబద్ధతను చూపుతారు. స్నేహితులకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు కష్టపడి చదవాల్సి ఉంటుంది.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాటక రాశివారు కొత్త వ్యవహారాలు మొదలుపెట్టకూడదు. లేకుంటే ఇబ్బందులు తప్పవు. మీరు వీలైనంత వరకు శాంతంగా ఉండాలి. అనైతిక పనులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో అశాంతి కలిగించే పనులు చేయకండి. మానసిక వ్యాకులతతో బాధపడతారు. నిరాశ పడకండి.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు అనుకున్న పనులేవి జరగకపోవచ్చు. జీవిత భాగస్వామితో విబేధాలు తలెత్తవచ్చు. బిజినెస్ వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. దేనినీ సులభంగా నమ్మకూడదు. విదేశీయులతో పరిచయం అయ్యే అవకాశం ఉంది.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొని ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు అనుకున్న పనులు అన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభపడతారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి ఏ మాత్రం బాగాలేదు. మీ యజమాని కోపాన్ని చవిచూడాల్సి వస్తుంది. తోటి ఉద్యోగులు మీకు సరిగ్గా సహకరించరు. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త!

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారు మౌనంగా, గంభీరంగా ఉండాలి. స్నేహితులు, బంధువులతో అభిప్రాయ బేధాలు రావచ్చు. మహిళల జోలికి, జలాశయాల జోలికి వెళ్లకూడదు. కీలకమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనస్సు రాశివారు ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. అన్నదమ్ములు, అక్కచెల్లెల్లతో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు. ఇవాళ మీ తారాబలం బాగుంది. కనుక మీకు ఏ రంగంలో పోటీ ఉండదు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. కానీ కుటుంబ సభ్యుల అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. కానీ ఇవాళ మీరు సాహసోపేతంగా ఎలాంటి పని చేసినా, కచ్చితంగా విజయాన్ని పొందుతారు.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. కుటుంబంలో అప్యాయతలు, అనురాగాలు వెల్లివిరుస్తాయి. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యత్మిక కార్యక్రమాల్లో పాల్గంటారు. దైవ ప్రార్థన మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు ఏకాగ్రతతో పనిచేయలేక ఇబ్బంది పడతారు. మానసికంగా నిరాశకు గురవుతారు. పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దైవ ప్రార్థనలు, ధానధర్మాలు చేయడం మంచిది.