Horoscope Today: ఈ రోజు(డిసెంబర్ 08) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.
ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలం అవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభులు మోగిస్తారు. ఇష్ట దేవతా శ్లోకాన్ని చదవడం అన్ని విధాలా మంచిది
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన సంతోషాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. దైవారాధన మానవద్దు.
శారీరకశ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలను వదలకండి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బంది పడతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ప్రశాంతత కోసం దైవ ధ్యానం చేయడం ఉత్తమం.
అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. విందువినోదాలతో కాలం గడుస్తుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.
మీ మీ రంగాల్లో తోటివారిని కలుపుకొనిపోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవచింతన అవసరం అవుతుంది. సూర్య ఆరాధన చేస్తే మంచిది.
ప్రారంభించబోయే పనిలో శ్రమ ఫలిస్తుంది. ముఖ్య విషయాల్లో అవగాహనాలోపం రాకుండా చూసుకోవాలి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కనకధారాస్తవం చదవాలి.
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు.పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మంచి మనస్సుతో పనులను ప్రారంభిస్తారు. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రబలం పెరుగుతుంది.ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.