Horoscope Today: ఈ రోజు(ఫిబ్రవరి 12) రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?..
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఆలోచనావిధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివ అష్టోత్తరం చదవాలి.
ప్రారంభించిన పనులలో విజయసిద్ధి ఉంది. శ్రమతో కూడిన సత్ఫలితాలను సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో లాభం పొందుతారు. లక్ష్మీస్తోత్రం చదివితే బాగుంటుంది.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
శుభకాలం. విశేషమైన ప్రగతి సాధిస్తారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన శుభప్రదం.
చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. సూర్యాష్టకం చదవడం మంచిది.
ప్రారంభించిన కార్యక్రమాలను మనోబలంతో పూర్తిచేస్తారు. ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గోసేవ చేయడం మంచిది.
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నత పదవీయోగం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభకరం.
మానసికంగా దృఢంగా ఉంటారు.మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధు, జన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
మనఃస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల అంతా మంచే జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.