ఈరోజు (30-09-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష రుతువు, భాద్రపద మాసం
బహుళపక్షం నవమి: సా. 6.04 వరకు తదుపరి దశమి
పునర్వసు: రా.10.56 వరకు తదుపరి పుష్యమి
వర్జ్యం: ఉ. 9.56 నుంచి 11.40 వరకు
అమృత ఘడియలు: రా.8.20 నుంచి 10.04 వరకు
దుర్ముహూర్తం: ఉ. 9.51 నుంచి 10.39 వరకు తిరిగి మ.2.38 నుంచి 3.25 వరకు
రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు
సూర్యోదయం: ఉ.5-53
సూర్యాస్తమయం: సా.5-49
మేషం
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. శివారాధన శుభప్రదం.
వృషభం
ధైర్యంతో సమస్యలను ఎదుర్కొంటారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలైన ఫలితాలను అందిస్తుంది.
మిథునం
మిశ్రమ కాలం. ముఖ్యమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవి,వెంకటేశ్వరుని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
కర్కాటకం
సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
సింహం
అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. బుద్ధిబలంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనం శుభప్రదం.
కన్య
మంచి ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది. రామనామాన్ని స్మరించండి.
తుల
శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
వృశ్చికం
పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
ధనుస్సు
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.
మకరం
మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.
కుంభం
చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.
మీనం
మంచి పనులు చేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అనుకూలత కలదు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. గోవింద నామాలు పఠించడం మంచిది.