ఈరోజు (28-09-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష రుతువు, భాద్రపద మాసం
బహుళపక్షం సప్తమి: మ.2.45 వరకు తదుపరి అష్టమి
మృగశిర: సా.6.37 వరకు తదుపరి ఆరుద్ర
వర్జ్యం: తె. 3.50 నుంచి 5.35 వరకు
అమృత ఘడియలు: ఉ. 8.53 నుంచి 10.39 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.16 నుంచి 9.04 వరకు తిరిగి రా.10.39 నుంచి 11.27 వరకు
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.5-53, సూర్యాస్తమయం: సా.5-51
మేషం
ఒక వ్యవహారంలో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి.
వృషభం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిరబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. చంద్ర శ్లోకం చదవండి.
మిథునం
ఉత్సాహంగా ముందుకు సాగండి. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. లేనిపోని అనుమానాలతో కాలయాపన చేయకండి. గోవింద నామాలు చదవాలి.
కర్కాటకం
చేపట్టే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. బంధుప్రీతి ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.
సింహం
మీరు పనిచేసే రంగంలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.
కన్య
పట్టుదలతో పనిచేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. చంద్రధ్యానం శ్రేయోదాయకం.
తుల
మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. తోటి వారి సహాయంతో కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. మనశ్శాంతి కోల్పోకుండా చూసుకోవాలి. శివ అష్టోత్తరం పఠిస్తే మంచిది.
వృశ్చికం
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
ధనుస్సు
ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
మకరం
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. తొందరపాటు చర్యలు వద్దు. ఎవరినీ అతిగా నమ్మవద్దు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. స్వస్థానప్రాప్తి ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం.
కుంభం
పెద్దల సలహాలు శక్తిని చేకూరుస్తాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శనిశ్లోకం చదవాలి.
మీనం
మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. బుద్ధిచాంచల్యం రాకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది.