ETV Bharat / bharat

Horoscope Today (26-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయంటే?

Horoscope Today (26-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

HOROSCOPE
రాశిఫలం
author img

By

Published : Sep 26, 2021, 4:47 AM IST

ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; బహుళపక్షం

పంచమి: ఉ. 10.38 వరకు తదుపరి షష్టి

కృత్తిక: మ. 1.28 వరకు తదుపరి రోహిణి

వర్జ్యం: లేదు.

అమృత ఘడియలు: ఉ.10.48 నుంచి 12.34 వరకు.

దుర్ముహూర్తం: సా. 4.17 నుంచి 5.05 వరకు.

రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు.

సూర్యోదయం: ఉ.5-53.

సూర్యాస్తమయం: సా.5-53.

మేషం

శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బలమైన ప్రయత్నంతో ధనలాభం ఉంది. దుర్గా శ్లోకం చదవండి.

వృషభం

బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పెద్దల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిథునం

ఇష్టకార్యసిద్ధి ఉంది. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. ధన,ధాన్య లాభాలు ఉంటాయి. అవసరానికి ఆదుకునేవారు ఉంటారు. ఇష్టదైవారాధన వల్ల మంచి జరుగుతుంది.

కర్కాటకం

అంతా శుభమే జరుగుతుంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చేకాలం. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహం

మనస్సౌఖ్యం ఉంది. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యవినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

కన్య

చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

తుల

పనులకు అడ్డంకులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

వృశ్చికం

ప్రారంభించబోయే పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించడం మంచిది.

ధనుస్సు

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

మకరం

మనోబలాన్ని కోల్పోరాదు. మంచి పనులు చేపడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

కుంభం

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.

మీనం

మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.