ఈరోజు (20/09/21) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
- గ్రహబలం: శ్రీ ప్లవనామ సంవత్సరం..
- దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; శుక్లపక్షం పూర్ణిమ: తె. 4.51 తదుపరి బహుళపక్ష పాడ్యమి పూర్వాభాద్ర: తె. 4.39
- తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం: ఉ. 10.45 నుంచి మ. 12.23 వరకు
- అమృత ఘడియలు: రా. 8.30 నుంచి 10.08 వరకు
- దుర్ముహూర్తం: మ. 12.18 నుంచి 1.07 వరకు తిరిగి మ. 2.43 నుంచి 3.32 వరకు
- రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
- సూర్యోదయం: ఉ.5-52
- సూర్యాస్తమయం: సా.5-57
మేషం..
శుభకాలం. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. శ్రమఫలిస్తుంది. స్థిరచిత్తంతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
వృషభం..
చేపట్టేపనుల్లో శ్రమపెరుగుతుంది. ఎవ్వరితోనూ విభేదించకండి. మాటవిలువను కాపాడుకోవాలి. సజ్జనులతో కాలాన్ని గడుపుతారు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీ రామ నామస్మరణ మేలు చేస్తుంది.
మిథునం..
ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది .ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గణపతి సందర్శనం శుభప్రదం
కర్కాటకం..
ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరిచేరనీయకండి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం.
సింహం..
చేపట్టిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం
కన్య..
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శుభప్రదం.
తుల..
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు . ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
వృశ్చికం..
తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.
ధనుస్సు..
మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధికమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
మకరం..
అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ నామాన్ని జపించడం ఉత్తమం.
కుంభం..
వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీధ్యానం శుభప్రదం.
మీనం..
గ్రహబలం విశేషంగా ఉంది. శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 19 - 25)