ETV Bharat / bharat

Horoscope Today (19-09-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈనాడు రాశి ఫలాలు

Horoscope Today (19/09/21) : నేటి మీ రాశిఫలం, గ్రహబలం ఎలా ఉన్నాయంటే..

Daily horoscope
నేటి రాశి ఫలాలు
author img

By

Published : Sep 19, 2021, 4:44 AM IST

Updated : Sep 19, 2021, 6:08 AM IST

ఈరోజు (19/09/21) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

గ్రహబలం: శ్రీ ప్లవనామ సంవత్సరం..

  • దక్షిణాయనం వర్ష రుతువు; భాద్రపద మాసం; శుక్లపక్షం చతుర్దశి: తె. 5.07 తదుపరి పూర్ణిమ శతభిషం: తె. 4.15
  • తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం: ఉ. 11.30 నుంచి మ. 1.06 వరకు
  • అమృత ఘడియలు: రా. 9.04 నుంచి 10.40 వరకు
  • దుర్ముహూర్తం: సా. 4.21 నుంచి 5.09 వరకు
  • రాహుకాలం: సా. 4.30 నుంచి 6.00 వరకు
  • సూర్యోదయం: ఉ.5-52
  • సూర్యాస్తమయం: సా.5-58

మేషం..

ప్రారంభించిన పనులు శీఘ్ర విజయాన్ని చేకూరుస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అర్థలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికంగా ఎదుగుతారు. లింగాష్టకం చదవాలి.

వృషభం..

సమయానుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీ దర్శనం ఉత్తమం.

మిథునం..

మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

కర్కాటకం..

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం మంచిది.

సింహం..

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.

కన్య..

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

తుల..

బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి. మంచి జరుగుతుంది. ఆంజనేయ దర్శనం శుభప్రదం.

వృశ్చికం..

లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

ధనుస్సు..

మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయం. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

మకరం..

పనిలో శ్రమ పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. దుర్గా ధ్యానం శుభప్రదం.

కుంభం..

రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరాదు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శుభఫలితాలు పొందడానికి వేంకటేశ్వర స్వామిని సందర్శించాలి.

మీనం..

మీ మీ రంగాల్లో యశస్సు పెరుగుతుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శత్రునాశనం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

ఇదీ చూడండి: Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 19 - 25)

Last Updated : Sep 19, 2021, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.