ఈరోజు (08-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..
శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం
శుక్లపక్షం విదియ: మ. 1.30 తదుపరి తదియ
స్వాతి: రా. 10.45 తదుపరి విశాఖ
వర్జ్యం: ఉ.శే.వ. 6.53 వరకు తిరిగి తె.వ. 4.00 నుంచి 5.29 వరకు
అమృత ఘడియలు: మ. 2.26 నుంచి 3.57 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.15 నుంచి 9.02 వరకు తిరిగి మ. 12.11 నుంచి 12.58 వరకు
రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.5-54, సూర్యాస్తమయం: సా.5-42
మేషం
మంచి ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. లక్ష్మీ గణపతి ధ్యానం శుభప్రదం.
వృషభం
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
మిథునం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం మంచిది.
కర్కాటకం
ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధు,మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.
సింహం
మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
కన్య
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ద్వితీయంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవిష్ణు ఆరాధన చేయడం మంచిది.
తుల
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని పెంచే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి.
వృశ్చికం
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి. అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది.
ధనుస్సు
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
మకరం
మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఈశ్వరుని ఆరాధిస్తే మంచిది.
కుంభం
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
మీనం
చేయాల్సిన పనులను వాయిదా వేయకండి. బంధుప్రీతి ఉంది. వస్త్ర ధాన్య లాభాలు ఉన్నాయి. ఎవరినీ అతిగా నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సూర్యస్తుతి శుభప్రదం.