ETV Bharat / bharat

Horoscope Today (10-10-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

Horoscope Today(10-10-2021): ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
నేటి రాశిఫలాలు
author img

By

Published : Oct 10, 2021, 4:44 AM IST

ఈరోజు (10-10-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; ఆశ్వయుజ మాసం

శుక్లపక్షం చవితి: ఉ. 8.57 తదుపరి పంచమి

అనూరాధ: రా. 7.36 తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం: రా. 12.48 నుంచి 2.17 వరకు

అమృత ఘడియలు: ఉ.9.54 నుంచి 11.23 వరకు

దుర్ముహూర్తం: సా.4.06 నుంచి 4.53 వరకు

రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు

సూర్యోదయం: ఉ.5-55, సూర్యాస్తమయం: సా.5-40 ఉపాంగ లలితా వ్రతం

మేషం

ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ప్రయాణాలు కలసి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభదాయకం.

వృషభం

చేపట్టే పనిలో శ్రద్ధ చాలా అవసరం. సంతోషంగా గడుపుతారు. లాభాన్ని చేకూర్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లక్ష్మీ ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.

మిథునం

మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఈశ్వర శ్లోకాలు చదవాలి.

కర్కాటకం

అనుకున్న పని జరుగుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరిని ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

సింహం

కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఈశ్వర ధ్యానం మేలు చేస్తుంది.

కన్య

ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. స్థానచలనం సూచితం. అధికారుల కోపానికి గురికాకుండా ఓర్పుగా ఉండండి. శివ నామాన్ని జపించాలి.

తుల

మిశ్రమకాలం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరి చేరనీయకండి. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.

వృశ్చికం

శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దైవారాధన శుభప్రదం.

ధనుస్సు

మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలున్నాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

మకరం

ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం.

కుంభం

మొదలు పెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భోజన నియమాలను తప్పకుండా పాటించాలి. శ్రీవారి దర్శనం శుభాన్నిస్తుంది.

మీనం

మంచి కాలం. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.