ETV Bharat / bharat

Horoscope Today (23-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..

ఈ రోజు రాశిఫలాలు (Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope today
Horoscope Today (23-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి..
author img

By

Published : Nov 23, 2021, 4:31 AM IST

ఈరోజు (22-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం; బహుళపక్షం

చవితి: రా. 9.01 తదుపరి పంచమి

ఆరుద్ర: ఉ.11.19 తదుపరి పునర్వసు

వర్జ్యం: రా.12.23 నుంచి 2.07 వరకు

అమృత ఘడియలు: లేవు

దుర్ముహూర్తం: ఉ. 8.25 నుంచి 9.10 వరకు తిరిగి రా.10.28 నుంచి 11.20 వరకు

రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు

సూర్యోదయం: ఉ.6.12, సూర్యాస్తమయం: సా.5-20

సంకష్టహర చతుర్థి

మేషం

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత ఉంది. గోసేవ చేయడం మంచిది.

వృషభం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్నచిన్నఅంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

మిథునం

మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ద వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది.

కర్కాటకం

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాల్లో మానసికంగా సంసిద్ధమై ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

సింహం

ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. సర్వత్రా శుభం చేకూరుతుంది. ఇష్టదైవస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కన్య

కాలం సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం.

తుల

పనిలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. దుర్గా ధ్యానం శుభప్రదం.

వృశ్చికం

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తి కావు. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళితే మంచి జరుగుతుంది. ఆంజనేయ సందర్శనం శుభప్రదం.

ధనుస్సు

మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం.

మకరం

మీలోని నిబద్దతే మిమ్మలి రక్షిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

కుంభం

మనసు పెట్టి పని చేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

మీనం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని వార్తలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం పఠించాలి.

ఇదీ చూడండి : మద్యం తాగమని రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.