ETV Bharat / bharat

Horoscope Today (18-11-2021): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - ఈ రోజు రాశిఫలాలు వార్తలు

ఈ రోజు రాశిఫలాలు(Horoscope Today) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
ఈ రోజు రాశిఫలాలు
author img

By

Published : Nov 18, 2021, 4:26 AM IST

ఈరోజు(18-11-2021) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల (Horoscope Today) వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి..

శ్రీ ప్లవనామ సంవత్సరం; దక్షిణాయనం శరదృతువు; కార్తిక మాసం;శుక్లపక్షం

చతుర్దశి: ఉ.11.12 తదుపరి పూర్ణిమ

భరణి: రా.1.21 తదుపరి కృత్తిక

వర్జ్యం: ఉ. 9.44 నుంచి 11.28 వరకు

అమృత ఘడియలు: రా. 8.08 నుంచి 9.52 వరకు

దుర్ముహూర్తం: ఉ. 9.53 నుంచి 10.38 వరకు తిరిగి మ. 2.22 నుంచి 3.06 వరకు

రాహుకాలం: మ. 1.30 నుంచి 3.00 వరకు

సూర్యోదయం: ఉ.6.10

సూర్యాస్తమయం: సా.5-21

కార్తిక పూర్ణిమ, జ్వాలాతోరణం

మేషం

శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలాలను ఇస్తుంది.

వృషభం

కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మనఃసౌఖ్యం ఉంటుంది. ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచిది.

మిథునం

కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రారంరంభించిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

కర్కాటకం

శుభఫలాలు అందుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం.

సింహం

వృత్తి,ఉద్యోగ,వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీవిష్ణు అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

కన్య

ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. దుర్గాష్టకం చదివితే మంచిది.

తుల

ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

వృశ్చికం

సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ధనస్సు

చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

మకరం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచి చేస్తుంది.

కుంభం

తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య ఆరాధన శుభప్రదం.

మీనం

ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదేవతా దర్శనం, శని ధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.