Horoscope Today(04-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు;
వైశాఖమాసం; శుక్లపక్షం 4-5-2022 బుధవారం చవితి: పూర్తి
మృగశిర: తె. 3-55 తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ఉ. 7-35 నుంచి 9-21 వరకు
అమృత ఘడియలు: సా. 6-12 నుంచి 7-58 వరకు
దుర్ముహూర్తం: ఉ.11-31 నుంచి 12-21 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు
సూర్యోదయం: ఉ.5.37, సూర్యాస్తమయం: సా.6.16
మేషం
ప్రయత్న పూర్వక విజయాలు ఉన్నాయి. మీ అభివృద్ధికి తోటి సహకారం తోడవుతుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో ఎవరినీ అతిగా నమ్మకండి. సాయి సందర్శనం శుభప్రదం.
వృషభం
స్థిరమైన భవిష్యత్తు కోసం బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతంగా వ్యవహరించండి. సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవడం శుభకరం.
మిథునం
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
కర్కాటకం
సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి,ఉద్యోగాల్లో సానుకూలత ఉంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి కోసం చేసే కొత్త ప్రయోగాలు విజయవంతం అవుతాయి. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
సింహం
ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం.
కన్య
క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం త్వరగా సిద్ధిస్తుంది. సమయానికి నిద్రాహారాలు మరవకండి. గిట్టనివారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. బంధు,మిత్రులను కలుస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగ్రహావేశాలకు పోవద్దు. శ్రీ విష్ణు ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.
తుల
మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యతిరేక ఫలితాలు రాకుండా బాగా కష్టపడాలి. చిన్నచిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. నిరుత్సాహాన్ని విడనాడాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
వృశ్చికం
విజయసిద్ది కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శివాభిషేకం శ్రేయస్సును ఇస్తుంది.
ధనుస్సు
ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం శుభప్రదం.
మకరం
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ విభేదించకండి. అష్టలక్ష్మీ దేవి సందర్శనం శుభప్రదం.
కుంభం
చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.
మీనం
ఆర్ధికంగా అనుకూల సమయం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. సమాజంలో గౌరవ,మర్యాదలు పెరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవారాధన శుభదాయకం.
ఇదీ చూడండి: ఈ వారం (మే 1-7) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..