Horoscope Today(15-05-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్దిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు ప్రశంసిస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మంచిది.

లక్ష్యాలను చేరుకునేందుకు ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మంచికాలం. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. బంధువులతో అనుకూలత ఉంటుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంటగెలుస్తారు. శివారాధన శుభప్రదం.

శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు రావొచ్చు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. సూర్య నమస్కారాలు చేయడం మంచిది.

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. దైవారాధన మానవద్దు.

శుభకాలం. అనుకూల ఫలితాలు అందుతాయి. సమాజంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీస్తుతి శ్రేయస్కరం.

మనఃస్సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది.

శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. సకాలంలో సహాయం చేసే వారు ఉన్నారు. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. శివారాధన మంచిది.

అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. చెడ్డవాళ్లు మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. శ్రీవెంకటేశ్వరస్వామి నామస్మరణ శుభప్రదం.