ETV Bharat / bharat

Horoscope Today(04-01-2022): ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? - గ్రహం అనుగ్రహం

Horoscope Today (04-01-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

Horoscope Today
Horoscope Today
author img

By

Published : Jan 4, 2022, 4:46 AM IST

Horoscope Today (04-01-2022): ఈ రోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు..

మేషం

విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ఆంజనేయుని ఆరాధించాలి.

వృషభం

మిశ్రమ వాతావరణం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనకు గురవుతారు. దైవారాధన మానవద్దు.

మిథునం

ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.

కర్కాటకం

ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచిది.

సింహం

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటమే మంచిది. శని శ్లోకాన్ని చదవండి.

కన్య

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.

తుల

అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరం చదవాలి.

వృశ్చికం

శుభకాలం. మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన మంచిది.

ధనుస్సు

ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మకరం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

కుంభం

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం

కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.