ETV Bharat / bharat

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (21-01-2022)

author img

By

Published : Jan 21, 2022, 4:36 AM IST

Horoscope Today: ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

HOROSCOPE TODAY
ఈ రోజు రాశి ఫలం

Horoscope Today: ఈ రోజు (21-01-2022) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయణం హేమంత రుతువు; పుష్య మాసం; బహుళ పక్షం

తదియ: ఉ. 7.39 తదుపరి చవితి మఘ: ఉ 8.58 తదుపరి పుబ్బ

వర్జ్యం: సా. 5.09 నుంచి 6.47 వరకు

అమృత ఘడియలు: ఉ. 8.08 వరకు తిరిగి రా. 2.58 నుంచి 4.36 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8.51 నుంచి 9.35 వరకు తిరిగి మ. 12.33 నుంచి 1.18 వరకు

రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు

సూర్యోదయం: ఉ.6.38, సూర్యాస్తమయం: సా.5.45 సంకష్టహర చతుర్థి

మేషం

శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన చేస్తే మంచిది.

వృషభం

ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

మిథునం

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్ట దేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

కర్కాటకం

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహం

కార్యసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

కన్య

పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.

తుల

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

వృశ్చికం

మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతంగా వాతావరణం ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

ధనుస్సు

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మ విశ్వాసంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

కుంభం

మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభాలను చేకూరుస్తుంది.

మీనం

మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.