Horoscope Today (02-01-2022): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
మేషం
చేపట్టిన పనులను ప్రణాళికా ప్రకారం పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.
వృషభం
చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.
మిథునం
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తే మేలు జరుగుతుంది. ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లలితాదేవి ఆరాధన శుభదాయకం.
కర్కాటకం
ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.
సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.
కన్య
మిశ్రమకాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గాదేవిని ఆరాధించాలి.
తుల
మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే మంచిది.
వృశ్చికం
చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువులతో మాటపట్టింపులకు పోరాదు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
ధనుస్సు
కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కనకదుర్గాదేవి సందర్శనం శుభప్రదం.
మకరం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
కుంభం
మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ రామ నామాన్ని జపించాలి.
మీనం
సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సాయం చేసే వారున్నారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. గోవింద నామాలు చదవడం ఉత్తమం.