Horoscope Today (28-12-2021): ఈరోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత రుతువు
మార్గశిర మాసం, బహుళ పక్షం
నవమి: మ. 1.18 తదుపరి దశమి
చిత్త: రా. 12.16 తదుపరి స్వాతి;
వర్జ్యం: ఉ.8.49 నుంచి 10.22 వరకు; తిరిగి తె.వ. 5.36 నుంచి;
అమృత ఘడియలు: లేవు; దుర్ముహూర్తం: ఉ. 8.44 నుంచి 9.28 వరకు తిరిగి రా.10.43 నుంచి 11.35 వరకు;
రాహుకాలం: మ. 3.00 నుంచి 4.30 వరకు
సూర్యోదయం: ఉ.6.33, సూర్యాస్తమయం: సా.5-30
మేషం
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతా స్తుతి శుభప్రదం.
వృషభం
ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.
మిథునం
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈశ్వర దర్శనం శుభప్రదం.
కర్కాటకం
అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన సత్ఫలితాలను ఇస్తుంది.
సింహం
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
కన్య
ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించినదాని కన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.
తుల
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడిని పెంచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి.
వృశ్చికం
మంచి ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సహకారం అందుతుంది. లక్ష్మీగణపతి ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.
మకరం
మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
కుంభం
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. హనుమాన్ చాలీసా జపించడం మంచిది.
మీనం
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర ధాన్య లాభాలు ఉన్నాయి. ఎవరినీ అతిగా నమ్మకండి. సూర్యస్తుతి శుభప్రదం.
ఇదీ చూడండి : మంచులో 150 మంది పర్యటకులు.. 12 గంటలు నరకం!