ఆగస్టు 11వ తేదీన మీ రాశిఫలాలు(Horoscope Today) ఎలా ఉన్నాయంటే..
మేషం
స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలను అందుకుంటారు. విశ్రాంతి లోపిస్తుంది. తొందరపాటు చర్యలొద్దు. ఎవరినీ ఎక్కువగా నమ్మరాదు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం.
వృషభం
మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. నవగ్రహ శ్లోకాన్ని పఠించాలి.
మిథునం
మీ మీ రంగాలలో అనుకున్నది సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీవెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
కర్కాటకం
అప్రమత్తంగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహాలను పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
సింహం
మీ ప్రతిభ, పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
కన్య
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. దత్తాత్రేయ సందర్శనం శుభప్రదం.
తుల
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీచుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉన్నది. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
వృశ్చికం
మనస్సౌఖ్యం ఉంది. ఆర్ధిక విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
ధనుస్సు
తలపెట్టిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. లక్ష్మీ ఆరాధన, కనకధారాస్తవం పఠించాలి.
మకరం
వృత్తి, ఉద్యోగ,వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. సమర్ధవంతంగా వాటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. దైవబలం కాపాడుతోంది. అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం శుభప్రదం.
కుంభం
మీకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఈశ్వర ధ్యానం చేస్తే మంచిది.
మీనం
మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. మీ ప్రతిభ,పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.