Horoscope Today (29-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం; బహుళ పక్షం చతుర్దశి: రా. 12.44 తదుపరి అమావాస్య రేవతి: రా. 6.49 తదుపరి అశ్విని వర్జ్యం: ఉ. 6.34 నుంచి 8.12 వరకు
అమృత ఘడియలు: సా. 4.21 నుంచి 5.59 వరకు దుర్ముహూర్తం: ఉ. 8.10 నుంచి 9.01 వరకు
తిరిగి మ. 12.22 నుంచి 1.12 వరకు రాహుకాలం: ఉ. 10.30 నుంచి 12.00 వరకు
సూర్యోదయం: ఉ.5.40, సూర్యాస్తమయం: సా.6.14 మాస శివరాత్రి
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది.
ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం.
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. ఆంజనేయ దర్శనం శుభప్రదం.
ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధు,మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం.
దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. సాయిబాబా దర్శనం శుభప్రదం.
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది.
పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది.
మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది. చతుర్ధ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం. చంద్ర శ్లోకం చదువుకోవాలి.
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ద్వితీయ స్థానంలో చంద్ర బలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి.