ETV Bharat / bharat

Horoscope Today (20-04-2022): నేటి మీ రాశిఫలం, గ్రహబలం తెలుసుకోండి.. - తెలుగు జాతకం

Horoscope Today (20-04-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
రాశిఫలం
author img

By

Published : Apr 20, 2022, 4:03 AM IST

Horoscope Today (20-04-2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

శ్రీ శుభకృత్​ నామ సంవత్సరం;

ఉత్తరాయణం; వసంత ఋతువు; చైత్రమాసం;

బహుళ పక్షం చవితి; సా. 5.09 తదుపరి పంచమి జ్యేష్ఠ తె. 3.01 తదుపరి మూల

వర్జ్యం ఉ.10.16 నుంచి 11.34 వరకు అమృత ఘడియలు రా.6.50 నుంచి 8.19 వరకు,

దుర్ముహూర్తం: ఉ.11.33 నుంచి 12.23 వరకు

రాహుకాలం: మ.12.00 నుంచి 1.30 వరకు

సూర్యోదయం: ఉ.5.45, సూర్యాస్తమయం: సా.6.12

.

మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం.

.

ఒక ముఖ్యమైన పనిని పూర్తిచేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు పడుతుంది. లింగాష్టకం చదవాలి.

.

చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల మంచి చేకూరుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభకరం.

.

ఉత్సాహంగా పనిచేస్తే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

.

శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద, కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు.

.

తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శని శ్లోకం చదవాలి.

.

మనఃసౌఖ్యం ఉంది. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ నామాన్ని జపించడం ఉత్తమం.

.

మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవి, శ్రీవేంకటేశ్వరుని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

.

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. రామనామ జపం శ్రేయోదాయకం.

.

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

.

మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆర్థికంగా మిశ్రమ కాలం. విందు,వినోదాలతో ఆనందంగా గడుపుతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

ఇదీ చూడండి : దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా విషాదం.. కుటుంబంలోని 11 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.