Horoscope Today: ఈ రోజు (ఏప్రిల్ 4) మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మీరు కవిత రాయడానికి లేదా ఒక మంచి బొమ్మ తయారు చేయడానికి ఈరోజు మంచిది. బాల్య స్నేహితుల్ని కలవడం ద్వారా చిన్ననాటి జ్ఞాపకాలు పంచుకొని ఆనందిస్తారు. మీ పైవారితో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారిని గౌరవించకపోయినట్లయితే మీరు నష్టపోవలసి వస్తుంది. మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారితో, పోటీదారులతో అభిప్రాయబేధాలు గొడవలకు దారి తీయవచ్చు. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి.

చాలా విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. ఇందులో ముఖ్యమైనది మీ తల్లి ఆరోగ్యం. కోర్టుకు సంబంధించి, స్థిర, చరాస్థుల కొనుగోలుకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండండి. సాయంత్రానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున నిరాశావాదాన్ని వీడి ఆశావాదులుగా ఉండండి. మీ విచారాలు తొలగి మానసికంగా, శారీరకంగా సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు ఈ సమయం బాగుంది. ఈ సమయాన్ని వృథా చేసుకోకండి. కళాత్మక పనులు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు భాగస్వాములయ్యే అవకాశం వుంది.

ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం మీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా. మీ ప్రయత్నాలలో మీరు విజేతలవుతారు. మీ ప్రత్యర్థులు అపజయం చవి చూస్తారు. మధ్యాహ్నం వరకు మీ గ్రహబలం అనుకూల రీతిలోనే నడుస్తుంది. మధ్యాహ్నం తర్వాత అనుకోని రీతిగా తలకిందులవుతుంది. మీ అమ్మగారి ఆరోగ్యం మిమ్మల్ని కలచివేస్తుంది. మీకు అంతటా ప్రతికూలతే దర్శనమిస్తోంది.

మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు వ్యతిరేకత అనేది కేవలం ఒక తాత్కాలిక కోణం. అయినా అది మిమ్మల్ని ఆందోళలనలో ఉంచుతుంది. చికాకు పరుస్తుంది. మిమ్మల్ని ఒక స్థిరమైన నిర్ణయానికి చేరుకోనివ్వదు. మీరు సందిగ్థంలో ఉంటారు. ఏది ఏమైనా,మధ్యాహ్నం తర్వాత అనుకూలంగానే ఉంటుంది. వృత్తిపరంగా కూడా మీరు బాగా రాణిస్తారు. మీ సున్నిత స్వభావం వల్ల మీకు ఒక స్నేహితుడు దొరుకుతారు. మీ సమస్యలని, బరువు బాధ్యతలని పంచుకుంటారు.

ఈ రోజు ఆత్మ విశ్వాసంతో ఉంటారు. మీ ఆత్మ గౌరవం పతాక స్థాయికి చేరుకుంటుంది. మీ నిర్ణయ శక్తికి, నాయకత్వ లక్షణాలకు సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఏ సమస్యనైనా క్షణాల మీద పరిష్కరించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం వల్ల మీకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పనులు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇంట్లో కొన్ని రకాల అవసరాలకు డబ్బు బాగానే ఖర్చు అవుతుంది. ఖర్చుపై చింతించకండి.

మీరు ఈరోజు తీవ్రమైన సున్నితత్వంతో, ఎక్కువ భావోద్వేగంతో ఉంటారు. మీరు బలహీనతకు లోనవ్వకూడదు. గొడవలను లేదా వివాదాలను నిర్లక్ష్యం చేయడం తెలివైన పని. మీరు మీ ప్రియమైన వారిని ఏమైనా నొప్పించేవి చెప్పడానికి ముందు ఆలోచించండి. మీరు మీ ఆర్దికస్థితిని ప్రమాదంలో పెట్టవచ్చు.

ఈ రోజు మీకు చికాకులు ఎక్కువ. అయినా కంగారు పడకండి. ఇది కూడా గడిచిపోతుంది. ఉదయం పూట బాగానే గడుస్తుంది. మీరు విహార యాత్రకు స్నేహితులతో, ప్రియమైన వారితో వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉదయం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. కొంత లబ్ధి కనిపిస్తోంది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి బాగుండకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాదన పెట్టుకునే వారికి దూరంగా ఉండండి. న్యాయపరమైన పనుల్లో జాగ్రత్తగా ఉండండి.

ఇది ఒక తిరుగులేని రోజు! సమయానికి పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ప్రశంసల కుండపోతలో ముద్దవడానికి సిద్ధంగా ఉండండి. స్థిరాస్తులైన భూమి, భవనాలకు సంబంధించి ఒప్పందాలు ఖరారు చేసుకోవడానికి ఇది మంచిరోజు.

ఈ రోజు మీకు కష్టతరంగా ఉంటుంది. అయితే, ఒక దైవ దర్శనం లేదా ధార్మిక కార్యకలాపాలు మీకు కొంత ఉపశమనం కలిగించవచ్చు. శారీరకంగా బలహీనంగా, నీరసంగా ఉన్నందువల్ల మీరు అత్యుత్తమ పనితీరును కనబరచకపోవచ్చు. ఇది మీ సహ కార్మికులతో విబేధాలకు కూడా దారితీయవచ్చు. అయితే, రోజు మధ్యాహ్నం నుంచి పరిస్థితులు సర్దుకుంటాయి. ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

ఈ రోజు చికాకు, కోపం మీద అదుపు తెచ్చుకోండి. మీరు దిగులుగా ఉంటారు. మీ శక్తియుక్తులన్నీ చివరికి ప్రతికూల ఫలాలనే ఇస్తాయి. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం. యోగా చేయండి. అది ప్రతికూల ఆలోచనలకు కళ్లెం వేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ ఇబ్బందులు తొలగుతాయి. అనుకోని ఖర్చులు ఉండవచ్చు. మధ్యాహ్నానికి తారాబలం మెరుగుపడుతుంది. ధార్మిక సంబంధమైన ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉన్న చింతలను మరవడానికి ఇదే మంచి మార్గం.

మీ వ్యాపార భాగస్వాములతో, కస్టమర్లతో ఒక ఆహ్లాదకరమైన రీతిలో వ్యవహరించండి. అది మీకు ప్రయోజనం కలిగిస్తుంది. తోటి కార్మికులతో చర్చలు మానుకోండి. మీరు పని వద్ద తీవ్రమైన కృషి చేసినా కూడా ఫలితాలతో సంతృప్తి చెందరు. ఇంట్లో చాలా ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటుంది.

ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు. కానీ మీ భాగస్వామితో మీకు చిన్న చిన్న గొడవలు వస్తాయి. అవి రోజు మొత్తం మిమ్మల్ని దిగులుగా ఉంచుతాయి. కొందరు వారి భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.