Horoscope Today 7th October 2023 : అక్టోబర్ 7న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : ఈ రోజు మీరు చేసే పనులకు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. రోజంతా సరదాగా గడుస్తుంది. ఎప్పటిలాగే మీ పనులను పూర్తి చేస్తారు. సాయంత్రం ఓ ఆశ్చర్యకరమైన సంఘటన మీకు ఎదురుకావచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తితో మధుర క్షణాలను గడపండి.
వృషభం (Taurus) : ఈ రోజు మీకు సాధారణంగా గడుస్తుంది. మీ స్నేహితులతో కలిసి అద్భుతమైన సమయాన్ని, సరదాగా గడుపుతారు. మరోవైపు కొందరు ఏర్పాటు చేసే ఆర్థిక వనరులను మీరు చక్కగా నిర్వహిస్తారు.
మిథునం (Gemini) : మీ చుట్టూ ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఈ రోజు మీరు సృష్టిస్తారు. ఇది మీ దృక్పథంపైన, ప్రయత్నాలపైనా ప్రతిబింబిస్తుంది. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఉల్లాసభరితంగా, ఆనందంగా గడపండి. మీకు నచ్చిన ఆహారాన్ని భుజిస్తారు. షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటకం (Cancer) : మీ ఆశాజనక, మేధోపరమైన ధోరణి మీకు అనుకూలమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. మీ వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటారు. మీ గృహంలోని ఇంటీరియర్‌ను మార్చే అవకాశాలు ఉన్నాయి.
సింహం (Leo) : మీ శక్తిసామర్థ్యాలను తక్కువ అంచనా వేసుకోవడం అంత మంచి నిర్ణయం అనిపించుకోదు. దేన్నైనా ఛేదించగలిగే శక్తి మీలో దాగి ఉంది. అందుకని మీ శక్తిని ఆధారంగా చేసుకొని మీ ప్రభావాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. దీని సాయంతో వ్యాపారపరంగా మీరు పెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుంటారు. ఇది గొప్ప వ్యాపారానికి బాటలు వేస్తాయి.
కన్య (Virgo) : కుటుంబంతో నెలకొన్న కొన్ని విభేదాలు ఈ రోజు తొలగిపోతాయి. పైగా ఇరువురి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుంది. వీలైతే స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా బయటకు వెళ్లండి. మిమ్మల్ని ఆకట్టుకునే వ్యక్తులు మీ ఈ రోజును ఫలవంతం చేస్తారు. విజయవంతంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.
తుల (Libra) : ఆందోళనల సుడిగుండంలో ఈ రోజు మీరు చిక్కుకుంటారు. దీంతో ఎన్నడూ లేనంత దీనమైన స్థితిలోకి ఈ రోజు మీరు వెళ్తారు. మీ పిల్లలతో విబేధాలు ఏర్పడవచ్చు. ఇది మిమ్మల్ని మరింత బాధిస్తుంది. మీరు పని చేసే చోట కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మీ పనిపట్ల మీ తోటివారు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు.
వృశ్చికం (Scorpio) : దేవునిపై నమ్మకం ఉంచి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మిమ్మల్ని గడ్డు పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. అశాంతి, చికాకులు ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.
ధనుస్సు (Sagittarius) : మీరు చేసే పనిలోని నాణ్యత ద్వారా మీలోని దృక్పథాన్ని, మీ లక్ష్యసాధన శక్తిని ఇతరులు గ్రహిస్తారు. మీ అభిరుచికి ఉత్తేజం కల్పించే దాన్ని మీరు ఈ రోజు మరో ఎత్తుకు తీసుకెళ్తారు.
మకరం (Capricorn) : రక్తసంబంధం అన్నింటికంటే బలమైనదనే మాట ఈ రోజు మీకు వర్తిస్తుంది. మీ ఇంటిని వాతావరణాన్ని పూర్తిగా మార్చేందుకు తగిన ప్రోత్సాహం, మద్దతు మీకు మీ కుటుంబం నుంచి లభిస్తుంది. కుటుంబం మీకు అండగా ఉంటుంది గనుక ప్రపంచాన్ని ఈ రోజు మీరు జయించగలుగుతారు.
కుంభం (Aquarius) : ఈ రోజు అందరి దృష్టంతా మీపైనే ఉంటుంది. శ్రద్ధా, ప్రశంసలు మీరు మరింత కష్టపడి పనిచేసేలా ప్రోత్సహిస్తాయి. మీ పనితీరు మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కానీ మీ పనితో మీరు వారిని పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేకపోవచ్చు.
మీనం (Pisces) : ఆందోళనలు మీ పనులను మరింత ఆలస్యం చేస్తాయి. ఇది మీలో నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని తగ్గిస్తాయి. ఆస్తికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపకపోవడం మంచిది. మీకు అపఖ్యాతి తీసుకువచ్చే పనులకు దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.