నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం
చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కాలం శుభప్రదంగా ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభాన్ని ఇస్తుంది.
వృషభం
స్వయంకృషితో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆందోళనను దరిచేరనీయకండి. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం.
మిథునం
బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాట పట్టింపులకు పోరాదు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.
కర్కాటకం
ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఇష్ట దైవప్రార్థన వల్ల మేలు జరుగుతుంది.
సింహం
గ్రహబలం అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో ముందుకు సాగి శుభఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు ఉంటాయి. దత్తాత్రేయ స్వామిని దర్శించండి.
కన్య
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. అనవసర విషయాలతో సమయం వృథా కానీయకండి. శివారాధన శుభప్ర
తుల
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం.
వృశ్చికం
ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. శని ధ్యానం మంచినిస్తుంది.
ధనుస్సు
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి అవుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. నవగ్రహ శ్లోకాలను చదవండి.
మకరం
మేలైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. విందు,వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు సాధ్యసాధ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. దుర్గా ఆరాధన చేయాలి.
కుంభం
అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మంచి మనస్సుతో ముందుకు సాగండి. కష్టాలు తగ్గుతాయి. ఇష్టదేవతా దర్శనం శుభప్రదం.
మీనం
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. మనస్సౌఖ్యం ఉంటుంది. లక్ష్మీధ్యానం చేయాలి.
ఇదీ చదవండి : అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై మోదీ సమీక్ష