ETV Bharat / bharat

september 1 Horoscope: ఈ రోజు రాశి ఫలం - Today Horoscope news

ఈ రోజు రాశిఫలాలు (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

september 1 Horoscope
ఈ రోజు రాశి ఫలం
author img

By

Published : Sep 1, 2021, 4:12 AM IST

నేటి రాశిఫలాల (Today Horoscope) గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

మేషం

మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందూ,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వరదర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వృషభం

వృత్తి,ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మిథునం

అనుకూల ఫలితాలు ఉన్నాయి. ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిరబుద్ధితో ముందుకు సాగాలి. గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్ష్మీ స్తుతి పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహం

ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి.

కన్య

ముఖ్య విషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్నివిషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి చేకూరుతుంది. ఆరోగ్యకరమైన పద్దతులను అవలంభించడం మంచిది. గోసేవ చేయడం మంచిది.

తుల

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.

వృశ్చికం

చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. తావివ్వరాదు. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. దుర్గారాధన శుభప్రదం.

ధనుస్సు

మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి.

మకరం

మంచి కాలం. కాలాన్ని సత్కార్యాలు వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆంజనేయస్వామి దర్శనం శుభకరం.

కుంభం

కుటుంబ సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.

మీనం

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.