ETV Bharat / bharat

ప్రేమ పెళ్లి చేసుకుందని దారుణం- కూతురు, అల్లుడు, మనవరాలి దారుణ హత్య - బిహార్ పరువు హత్య

Honour Killing in Bihar : ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో కుమార్తె కుటుంబాన్ని దారుణంగా హత్య చేశారు ఆమె తండ్రి, సోదరుడు. నడి రోడ్డుపై దారుణంగా కొట్టి అనంతరం తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటన బిహార్​లోని భాగల్​పుర్​లో జరిగింది.

Bhagalpur Triple Murder
Bhagalpur Triple Murder
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 8:34 AM IST

Honour Killing in Bihar : బిహార్ భాగల్​పుర్​ పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో కుమార్తె కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి. అతడికి కుమారుడు సైతం సహకరించాడు. నడి రోడ్డుపై దారుణంగా కొట్టి అనంతరం తుపాకీతో కాల్చి చంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
గోపాల్​పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధికి చెందిన నిందితుడు కుమార్తె మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఓ పాప కూడా జన్మించింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారు అదే గ్రామంలో నివసించడం వల్ల కుమార్తెను బెదిరించాడు తండ్రి. ఇదే గ్రామంలో ఉండొద్దని, మరో ప్రాంతానికి వెళ్లి నివసించాలని సూచించాడు. కానీ ఆ మాటలు పట్టించుకోకపోవడం వల్ల ఆగ్రహించిన తండ్రీకొడుకులు, వారిపై దాడిగి దిగారు. నడిరోడ్డుపై కుమార్తె, అల్లుడు, రెండేళ్ల మనవరాలిని ఐరన్​ రాడ్​తో దారుణంగా కొట్టాడు తండ్రి. ఈ క్రమంలోనే నిందితుడి కుమారుడు ముగ్గురిని తుపాకీతో కాల్చడం వల్ల అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్​మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే
Brother Killed Sister In Maharashtra : తమ సోదరి వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని ఆమెను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు ఇద్దరు సోదరులు. భయంతో దాక్కున్నా వెతికి మరీ హతమార్చారు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్​ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను రిమాండ్​కు తరలించారు.

పెళ్లైనా ప్రియుడితోనే ప్రేమాయణం
Father Killed And Burnt His Daughter : కర్ణాటక కోలార్​లో పరువు హత్య కలకలం రేపింది. పెళ్లి చేసిన తర్వాత కూడా ప్రియుడితో మాట్లాడుతోందని 17 ఏళ్ల కూతురిని హత్య చేశాడు ఓ తండ్రి. కర్రతో కొట్టి హత్య చేసి మృతదేహాన్ని కాల్చివేశాడు. అనంతరం తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. ఈ ఘటన ఈ ఏడాది మేలో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లవ్​ మ్యారేజ్​ చేసుకుందని కూతురు దారుణ హత్య.. ఆమె ఫ్లాట్​కు వెళ్లి.. గొంతు నులిమి

పరువు హత్య కలకలం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని నడిరోడ్డుపై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.