ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువు కోసం కన్న కూతురి తల నరికి చంపిన ఘటన మరువక ముందే.. రాజస్థాన్ దౌసాలో అచ్చం ఇటువంటి ఘటనే జరిగింది. పెళ్లి చేసిన తర్వాత.. గతంలో ప్రేమించిన ప్రియుడితో పారిపోయిందని కన్న కూతుర్నే కడతేర్చాడు ఓ తండ్రి. పోలీసు స్టేషన్లో లొంగిపోయి.. తన కుమార్తెను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.
ఇదీ జరిగింది
దౌసా జిల్లాకు చెందిన ఓ యువతి.. ఎస్సీ యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు బలవంతంగా ఫిబ్రవరి 16న పెళ్లి చేశారు. అయితే కొన్ని రోజులకే ప్రియుడితో వెళ్లిపోయింది. మళ్లీ కొన్ని రోజులకు ఇంటికి వచ్చింది. విషయం తెలిసి ఆగ్రహంతో ఉన్న తండ్రి.. ఆమె తల నరికి చంపేశాడు. అనంతరం పోలీసుల స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇదీ చూడండి: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు వారి పనే!