Honor Killing: అక్కకు రక్షగా ఉండాల్సిన తమ్ముడే.. ఆమెను పొట్టనపెట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని కూడా హతమార్చాడు. రాఖీ పండగ రోజే ఈ అమానవీయ ఘటన జరగడం కలచివేస్తోంది. మహారాష్ట్ర జల్గావ్లో శుక్రవారం రాత్రి ఈ పరువు హత్య కలకలం రేపింది. మైనర్ అయిన నిందితుడు హత్య అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
ఇదీ జరిగింది.. రాకేశ్ సంజయ్ రాజ్‌పుత్(22), వర్ష సమాథాన్ కోలీ(20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ విషయం వర్ష ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తమ్ముడు పిస్టల్ తీసుకొని వారిని వెంబడించాడు. ఈ క్రమంలోనే రాజ్‌పుత్‌ను కాల్చి చంపిన నిందితుడు.. తన సోదరిని గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రధాన నిందితుడు పిస్టల్‌తో పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మరో మైనర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలో భాగమైన మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఛోప్టా సమీపంలోని జునా వరాడ్ శివార్లలో మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: దుస్తులలో రూ100 కోట్ల డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు