ETV Bharat / bharat

ఆడ కోతి ప్రేమను ఎరగా వేసి రౌడీ కోతిని బంధించిన అధికారులు

author img

By

Published : Aug 14, 2022, 1:48 PM IST

మహారాష్ట్ర అహ్మద్​నగర్​ జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రజలపై దాడి చేస్తున్న మగకోతిని పట్టుకునేందుకు ఆడకోతిని రంగంలోకి దింపారు అటవీ అధికారులు. అనేక సార్లు విఫలయత్నం చేసి చివరకు కోతిని పట్టుకున్నారు.

male monkey love female monkey
కోతిని బంధించిన అధికారులు

ప్రజలపై దాడిచేసి గాయపరుస్తున్న కోతిని పట్టుకునేందుకు.. అనేక సార్లు ప్రయత్నించి అటవీ అధికారులు విఫలమయ్యారు. ఇలా కోతిని బంధించడం సాధ్యం కాదంటూ ఓ వెరైటీ ఆలోచన చేశారు. మగకోతిని పట్టుకునేందుకు ఓ ఆడకోతిని రంగంలోకి దింపారు. మగ కోతిని ఆడ కోతి ప్రేమలో పడేలా చేశారు. చివరకు అనుకున్నది సాధించారు. కోతిని బంధించడం వల్ల గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.

మహారాష్ట్ర అహ్మద్​నగర్​ జిల్లాలోని సంగమనేర్​ తాలుకాలో ఓ కోతి హల్​చల్​ చేస్తోంది. సాకుర్​ గ్రామంలోని ప్రజలపై దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. కోతి దాడిలో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఇద్దరు చిన్నారులపైన కూడా దాడి చేసింది. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు. రంగంలోకి దిగిన అధికారులు అనేక సార్లు విఫలయత్నాలు చేశారు. గ్రామంలో అనేక చోట్ల బోనులు ఏర్పాటు చేసినా కోతి చిక్కలేదు.

male monkey love female monkey
దాడిలో గాయపడిన చిన్నారి

ఎంత ప్రయత్నించినా కోతి దొరకకపోవడం వల్ల.. చివరకు కోతిని పట్టుకునేందుకు ఓ వెరైటీ ఆలోచన చేశారు అధికారులు. కోతిని బంధించేందుకు మరో ఆడ కోతిని తీసుకువచ్చి ప్రేమలో పడేశారు. దాని వలలో పడిన మగ కోతి.. ఆడ కోతి ఉన్న ప్రదేశానికి చేరుకుంది. దీనిని గమనించిన అధికారులు మగకోతికి మత్తుమందు ఇచ్చారు. మత్తు ఇంజక్షన్​ నుంచి తప్పించుకున్న కోతి వాగులోకి దూకింది. వెంటనే అప్రమత్తమై వాగులోకి దూకిన అధికారులు.. కోతిని పట్టుకుని బోనులో బంధించారు.

male monkey love female monkey
కోతిని బంధించిన అధికారులు

ఇవీ చదవండి: చనిపోయినట్టు నటించి చిరుతకు షాకిచ్చిన శునకం

వచ్చే ఏడాది డిసెంబర్​లోనే అయోధ్య రాముడి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.