ETV Bharat / bharat

కరోనా వ్యాప్తితో చదువులకు తాళం - కరోనా వ్యాప్తితో బడులకు మళ్లీ సెలవులు

పాఠశాలల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు బడులను మళ్లీ మూసేశాయి. మరిన్ని రాష్ట్రాలు ఆ దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో అభ్యసన అంతరాలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో సురక్షిత తరగతి ప్రణాళికతో విద్యాలయాలను నడపాల్సిన అవసరం ఉంది.

Holidays again for campuses
బడులకు మళ్లీ సెలవులు
author img

By

Published : Mar 29, 2021, 7:20 AM IST

భారత్‌లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. తాజాగా పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఈ వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని ఓ వసతి గృహంలో 327 మందిలో 229 మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పలు పాఠశాలల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలు, వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంది. వ్యాధి బారిన పడిన వారందరినీ ఆయా వసతి గృహాల్లోనే హోం ఐసొలేషన్‌లో ఉంచి పర్యవేక్షించడం తలకు మించిన భారంగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాసంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి తీవ్రతను తగ్గించడానికి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భాగంగా పాఠశాలలను మూసివేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్‌ ప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు బడుల మూసివేతకు ఆదేశాలు జారీ చేశాయి. ఆ దిశగా మరిన్ని రాష్ట్రాలు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా అనేక విద్యాసంస్థల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించడంలేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తే... కొన్నిరోజులుగా సాధారణ పాఠశాలలతో పోలిస్తే- సాంఘిక సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. విద్యార్థులతో మాస్కులు ధరింపజేయడం, భౌతిక దూరం, పరిశుభ్రత వంటి అంశాల్లో యంత్రాంగం తగిన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. విద్యాసంస్థల్లో కొవిడ్‌ పరీక్షలు మందగించడమూ వ్యాధి వ్యాప్తికి కారణమని అంచనా. తెలంగాణలో మెజారిటీ గురుకులాలు, వసతి గృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పరిస్థితులు సైతం ఇలానే ఉన్నాయి. వైరస్‌ వ్యాప్తికి కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఒక కారణమైతే ఇటీవలే రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కూడా మరో కారణంగా అంచనా వేస్తున్నారు. ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు, తెలంగాణలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులకు హాజరైన విద్యారంగ సిబ్బందిని ఎలాంటి పరీక్షలు చేయకుండానే... మళ్ళీ బడులకు పంపించేశారు. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నికల వల్ల మరెంత ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు మరుగుదొడ్లు, భోజనశాలలవంటి మౌలిక వసతుల కొరత కూడా వైరస్‌ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. ఆరు మాసాల క్రితం దేశంలోని 15 రాష్ట్రాల్లో పలు పాఠశాలల్లో కాగ్‌ పరిశీలనలో 70శాతం మూత్రశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయని... లక్షా 40 వేల మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయని తేలింది.

పాఠశాలలు మళ్ళీ మూతపడటంవల్ల విద్యార్థుల్లో అభ్యసన అంతరాలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా విద్యార్థులకు పాఠశాలే సురక్షితమైన ప్రదేశం. వారి సమగ్రాభివృద్ధికి పునాది అక్కడే పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షిత తరగతి ప్రణాళికతో విద్యాలయాలను నడపవలసిన అవసరం ఉంది. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. ప్రత్యక్ష బోధన జరుగుతున్నప్పటికీ- ఆన్‌లైన్‌ తరగతులనూ కొనసాగించాలి. ఇది విద్యార్థుల అభ్యసనాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వసతి గృహాల నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాలి. ఇందులోని విద్యార్థులందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి బారిన పడిన వారిని ఐసొలేషన్‌ కేంద్రాల్లో పర్యవేక్షిస్తూ, పౌష్టికాహారం అందించాలి. పాఠశాల మౌలిక వసతుల కల్పన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇటీవల భారత్‌లో రెండు కోట్ల మంది చిన్నారులపై నీటిఎద్దడి ప్రభావం ఉందని యూనిసెఫ్‌ నివేదిక పేర్కొంది. పిల్లలు సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లకు దూరమవడంతో పాటు వారిపై ఇతర వ్యాధుల ముప్పు అధికంగా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పాఠశాలకు ఇప్పటికీ సరిపడా తరగతి గదులు లేవు. విద్యాహక్కు చట్టం-2009లో పేర్కొన్న విధంగా ప్రమాణాలతో కూడిన బహుళ వసతుల భవనాలు నిర్మించాలి. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. ప్రస్తుతం యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో అమలవుతున్న వాష్‌ కార్యక్రమాన్ని పాఠశాలలో సమర్థంగా నిర్వహించాలి. తరగతి గదులను నిత్యం శానిటైజ్‌ చేయాలి. చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్రతి పాఠశాలలో ఏర్పాట్లు చేయాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు తక్షణమే టీకా ఇవ్వాలి. ఎందరో విద్యార్థుల కుటుంబాలు కొవిడ్‌తో ఆర్థికంగా దెబ్బతిన్నందున పిల్లలకు ప్రభుత్వాలు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందించాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. అన్నిచోట్లా ఇది అమలైతే, పాఠశాల సురక్షిత స్థలంగా మారి, విద్యార్థి మనోవికాసానికి పునాది పడుతుంది.

- సంపతి రమేష్‌ మహారాజ్‌

ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఒక్కరోజే 40 వేల కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.