ETV Bharat / bharat

హెచ్​ఐవీ సోకిందన్న విషయం దాచి.. భార్యపై వరకట్న వేధింపులు! - uెచ హెచ్​ఐవీ భర్త

HIV positive man hides status: తన భర్త వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. హెచ్​ఐవీ సోకినా ఆ విషయం తనకు చెప్పలేదని.. అయినా కలిసే ఉంటున్నామని వివరించింది. ఇప్పుడు డబ్బులు, నగలు తీసుకొని ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది.

HIV positive man hides status
HIV positive man hides status
author img

By

Published : Jan 14, 2022, 7:36 PM IST

HIV positive man hides status: హెచ్​ఐవీ సోకిందన్న విషయాన్ని తనకు చెప్పకుండా దాచాడని భర్తపై ఫిర్యాదు చేసింది ఓ మహిళ. తన వద్దనున్న బంగారం అంతా తీసుకొని.. ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది. కర్ణాటకలోని బెంగళూరులో జరిగిందీ ఘటన. హెచ్​ఐవీ విషయం తెలిసిన తర్వాత కూడా అతడితోనే ఉంటున్నా.. బయటకు గెంటేశాడని బాధితురాలు బసవనగుడి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఇంజినీర్​ అయిన ఆమె భర్తపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు పోలీసులు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరికీ 2018 మార్చి 12న వివాహం జరిగింది. హనీమూన్​కు వెళ్లిన సమయంలో కడుపునొప్పి కారణంగా.. వీరిద్దరి మధ్య లైంగిక సంపర్కం జరగలేదు.

తిరిగి వచ్చిన అనంతరం.. తన భర్త వరకట్నం కోసం వేధించాడని ఆమె తెలిపింది. కంప్యూటర్​ కోర్స్​ నేర్చుకుంటానని తన తండ్రిని నమ్మించి.. లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించింది. అదే సమయంలో.. బాధితురాలికి ఇంట్లో అతడి మెడికల్​ రిపోర్ట్​ కనిపించింది. అందులో తన భర్తకు హెచ్​ఐవీ పాజిటివ్​ అని తెలిసి షాకయ్యింది. తర్వాత ఆమెకు కూడా పాజిటివ్​గా తేలింది. పెళ్లికి ముందు తన భర్త ఈ విషయం చెప్పలేదని తొలుత పోలీసులను ఆశ్రయించింది.

''ఇతర మహిళలతో సంబంధం పెట్టుకున్నందుకు హెచ్​ఐవీ సోకిందా? లేదా? అన్నది నా భర్త ఇప్పటివరకు నాకు చెప్పలేదు. అతడితో ఉన్నందుకు నాకు కూడా ఇప్పుడు హెచ్​ఐవీ సోకింది.''

- బాధిత మహిళ

భర్త వేధింపులు తగ్గకపోగా సదరు బాధితురాలు.. రాష్ట్ర మహిళా కమిషన్​ను ఆశ్రయించింది. అక్కడి అధికారులు దంపతులకు కౌన్సిలింగ్​ ఇచ్చి పంపించారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవీ చూడండి: 'నన్నమ్మ' షో సూపర్​స్టార్ దుర్మరణం.. పాపం ఆరేళ్ల వయసులోనే...

స్టీల్​ ప్లాంట్​ కోసం పంటలు ధ్వంసం- అడ్డుకున్న రైతులపై లాఠీఛార్జ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.