Student arrested for Hitech Copying in JEE Advanced Exam : నలుగురు కుర్రాళ్లు వాట్సాప్ గ్రూప్ పెట్టి మరీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ చేస్తూ దొరికిపోయిన ఘటన సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం నాడు(జూన్ 4న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన చింతపల్లి చైతన్య కృష్ణను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ సిటీలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు.. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి, సికింద్రాబాద్ కేంద్రాలలో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాశారు.
Hitech Copying in JEE Exam : పరీక్షకు సరిగ్గా సన్నద్ధం కాలేదో ఏమో మరీ.. ఈ నలుగురు కాపీయింగ్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఆ నలుగురే సభ్యులుగా ఉన్నారు. ఆదివారం ఉదయం పరీక్షకు వారు చాకచక్యంగా తమ తమ స్మార్ట్ ఫోన్లతో పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించారు. నలుగురిలోనూ తెలివైన విద్యార్థి. సికింద్రాబాద్ ప్యాట్నీలోని ఎన్పీఐటీ కాలేజ్‌లో పరీక్ష రాసి, గణితం, రసాయన శాస్త్రానికి సంబంధించిన సమాధానాల స్క్రీన్ షాట్స్‌ను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఎల్బీనగర్, మల్లాపూర్, మౌలాలి కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న మిగతా ముగ్గురు విద్యార్థులూ ఆ సమాధానాలను కాపీ చేశారు.
- జేఈఈ మెయిన్ ఫలితాల్లో.. తెలుగు విద్యార్థుల సత్తా
- జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు విడుదల.. రిజల్ట్ చెక్ చేసుకోండిలా..
Smart Copying in JEE Advanced Exam : ఈ క్రమంలోనే ఒక కేంద్రంలో ఇన్విజిలేటర్ ఈ బాగోతాన్ని గమనించి విద్యార్థిని పట్టుకున్నారు. అతణ్ని ప్రశ్నించగా.. మొత్తం తతంగమంతా బయటపడింది. వెంటనే ఆ కేంద్రం వారు హైదరాబాద్ ఐఐటీ అధికారులకు సమాచారం అందించారు. వారు సికింద్రాబాద్ ఎస్పీ ఐఈ సెంటర్లో విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు సమాచారం చేరవేశారు. అప్రమత్తమైన ఇన్విజిలేటర్ వెంటనే వెళ్లి తనిఖీ చేయగా విద్యార్థి వద్ద స్మార్ట్ ఫోన్ లభిచింది. దీంతో ఆ పరీక్షా కేంద్రం అధికారులు మెండా మార్కెట్ పోలీసులకు సమాచారం అందించి విద్యార్థిని అప్పగించారు.
Mass Copying in JEE Advanced Exam : అతడిపై మెండా మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సికింద్రాబాద్ ఎస్పీఐటీ సెంటర్లో పట్టుబడిన ఆ తెలివైన విద్యార్థిది కడప జిల్లా. ఎస్ఎస్సీలో 600/800 మార్కులు, ఇంటర్లో 940/1000 మార్కులు సాధించాడు. ఇంత తెలివైన విద్యార్థి.. స్నేహితుల కోసం తన భవిష్యత్తును అంధకారం చేసుకున్నాడని అతడి బంధువు ఒకరు ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరీక్ష నిర్వహణను హైదరాబాద్ ఐఐటీ ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించింది. విద్యార్థి స్మార్ట్ ఫోన్‌ను పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లడాన్ని సదరు సంస్థ గమనించలేదు. పరీక్ష హాల్ పెద్దగా ఉండడం. ఇన్విజిలేటర్ ఎక్కడో ఒక చోట కూర్చుని ఉండడం వల్లనే ఫోన్లలో జవాబులను తమ వాట్సాప్ గ్రూపునకు పంపడం సులువైందని పట్టుబడ్డ విద్యార్థి చెబుతుండడం గమనార్హం.
ఇవీ చదవండి: