ETV Bharat / bharat

'హిందుత్వంలో హిందూ భావనే లేదు.. అది సంఘీ ధర్మం' - శశిథరూర్ హిందూఇజం

హిందుత్వం అనేది తప్పుదారి పట్టించే పదమని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor Hinduism) పేర్కొన్నారు. అందులో హిందూ భావనే లేదని (Shashi tharoor Hindutva) అన్నారు. హిందూఇజం అంటే సత్యాన్ని అన్వేషించే మార్గమని, హిందుత్వం అంటే రాజకీయ భావజాలం (hinduism vs hindutva) అని చెప్పారు. హిందుత్వాన్ని ఇతర మతాల వారికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

Shashi Tharoor
శశిథరూర్
author img

By

Published : Nov 18, 2021, 3:52 PM IST

హిందుత్వం, హిందూఇజం భావనలపై (hinduism vs hindutva) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పదాలు (hinduism and hindutva) వేర్వేరు అర్థాలను ఇస్తాయని తెలిపారు. ఒకటి మతం అయితే.. ఇంకోటి రాజకీయమని చెప్పారు. ఈ రెండూ ఒకదానినొకటి పెనవేసుకొని ఉండవని అన్నారు. 'ప్రైడ్, ప్రిజుడస్, పండిట్రి' పేరుతో తాను రాసిన కొత్త పుస్తకాన్ని దిల్లీలో ఆవిష్కరించారు థరూర్. అనంతరం ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

"నా భావనలో హిందూఇజం (Shashi Tharoor Hinduism) అంటే వ్యక్తిగతంగా మతపరమైనదని అర్థం. సత్యాన్ని అన్వేషించే మార్గం. చివరకు ఈ సత్యం మనలోనే గుర్తిస్తాం. ఇదే విధంగా ఇతరుల్లోనూ వేరే సత్యాలు ఉంటాయి. వాటిని మనం గౌరవించాలి. భిన్నత్వాన్ని ఆమోదించడమే హిందూఇజం ప్రాథమిక సూత్రం. మనం చూస్తున్న హిందుత్వం (Shashi tharoor Hindutva) చాలా భిన్నం. అది రాజకీయ భావజాలం. వేదాంతంలోని సమ్మిళిత ఆలోచనలకు బదులుగా.. హిందుత్వం హిందూఇజాన్ని కేవలం గుర్తింపు వరకే పరిమితం చేసింది. అలాంటి విధానం నా దృష్టిలో హిందూ, హిందూఇజం, హిందూ ధర్మం కాదు."

-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ

రాజకీయాలకు మతానికి సంబంధం లేదని థరూర్ (Shashi tharoor hindu) పేర్కొన్నారు. అదే విధంగా మతానికి రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.

"మతం అంటే ఆధ్యాత్మికత కోసం అన్వేషణ. రాజకీయం అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల జీవితాలను ఎలా మెరుగుపర్చాలనే ఆలోచన. అన్ని విషయాల్లోకి రాజకీయాలను చొప్పించే నాయకులు మనల్ని పాలిస్తున్నారు. అది తప్పు."

-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ

ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపా హిందుత్వాన్ని ఇతర మతాల ప్రజలకు వ్యతిరేకంగా వాడుకుంటోందని థరూర్ ఆరోపించారు. హిందుత్వం అనేది తప్పుదారి పట్టించే పదమని వ్యాఖ్యానించారు. హిందుత్వంలో 'హిందూ' భావనే లేదని చెప్పారు.

"హిందుత్వం అంటే చాలా వరకు విభజనవాదంతో కూడిన రాజకీయ భావజాలం. ఇతర మతాలవారికి వ్యతిరేకంగా పదునైన ఆయుధంగా దీన్ని వారు(భాజపా నేతలు) వాడుతున్నారు. హిందూ ధర్మం అది బోధించదు. వీటిని రాజకీయాలకు వాడుకుంటున్న వారిని వేరే పేరుతో పిలవడం మంచిది. 'సంఘ్ పరివార్' అని పిలవాలి. హిందుత్వం కాకుండా 'సంఘీ ధర్మం' గురించి మాట్లాడుకోవాలి."

-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ

కంగన, వీర్​దాస్ వ్యాఖ్యలపై..

'టూ ఇండియాస్' పేరుతో స్టాండప్ కమెడియన్ వీర్ దాస్ చేసిన వ్యాఖ్యలతో (Shashi tharoor on Vir das) పాటు నటి కంగనా రనౌత్ స్వాతంత్ర్యంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై (Shashi tharoor on Kangana ranaut) థరూర్ స్పందించారు. 'వీర్ దాస్ చెప్పిన విషయాలను ఆస్వాదించా. కంగన వ్యాఖ్యలకు షాక్ అయ్యా. చరిత్రపై అభిప్రాయాలు చెప్పాలనుకునేవారు ముందుగా చరిత్రను చదవాలి. ఈ దేశాన్ని మెరుగ్గా చూడాలని భావిస్తూ చెప్పేవారి మాటలను వినాలి. వారిని మీరు వ్యతిరేకించవచ్చు. కానీ, ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను చెప్పేందుకు హక్కు ఉంటుంది' అని అన్నారు.

'మోదీ, పటేల్​కు పోలికా?'

మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్​ మధ్య భావసారూప్యతలపై (Shashi tharoor on Modi) తన కొత్త పుస్తకంలో ప్రస్తావించారు థరూర్. 'పటేల్​ను తమకు అనుకూలంగా మోదీ ప్రచారం చేసుకోవడాన్ని మేము అర్థం చేసుకున్నాం. అయితే సర్దార్ పటేల్.. దేశ ఐక్యతకు చిహ్నం. గొప్ప జాతీయవాద నేత, గుజరాత్ నుంచి వచ్చిన గొప్ప నాయకుడు. కానీ, మోదీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలంపై ఆయనకు కొంచెం కూడా ఆసక్తి లేదు. కేంద్ర హోంమంత్రిగా ఆరెస్సెస్​ను నిషేధించిందే పటేల్. అది పక్కనబెడితే.. విభజన సమయంలో దేశంలో నెలకొన్న మతపరమైన హింస... 2002లో మోదీ హయాంలో జరిగిన హింసకు చాలా తేడా ఉంది. కాబట్టి వీరిద్దరి మధ్య పోలిక లేదు' అని వివరించారు శశి థరూర్.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.