కేంద్రమంత్రి నారాయణ్ రాణెపై(narayan rane news) విశ్వహిందూ సేన జాతీయ అధ్యక్షుడు అరుణ్ పాఠక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి తల తెస్తే రూ. 51 లక్షలు రివార్డ్‌గా ఇస్తానని ప్రకటించారు. యూపీ బెనారస్లోని భేల్పుర్ ప్రాంతానికి చెందిన పాఠక్ ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్లో రాణెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.
-
मैं तुझसे वादा करता हूँ अहसान फरामोश नारायण राणे की तेरे मरने के बाद काशी में तेरी अस्थियां विसर्जित नहीं करने दूंगा और तेरी आत्मा सदियों तक भटकते रहेंगी @Jansatta @NarayanRane @BJP4India @ShivSena @OfficeofUT @TV9Marathi @TheWireMarathi @SakalMediaNews @Maharashtratim1
— Arun Pathak (@Arunpathak_In) August 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">मैं तुझसे वादा करता हूँ अहसान फरामोश नारायण राणे की तेरे मरने के बाद काशी में तेरी अस्थियां विसर्जित नहीं करने दूंगा और तेरी आत्मा सदियों तक भटकते रहेंगी @Jansatta @NarayanRane @BJP4India @ShivSena @OfficeofUT @TV9Marathi @TheWireMarathi @SakalMediaNews @Maharashtratim1
— Arun Pathak (@Arunpathak_In) August 24, 2021मैं तुझसे वादा करता हूँ अहसान फरामोश नारायण राणे की तेरे मरने के बाद काशी में तेरी अस्थियां विसर्जित नहीं करने दूंगा और तेरी आत्मा सदियों तक भटकते रहेंगी @Jansatta @NarayanRane @BJP4India @ShivSena @OfficeofUT @TV9Marathi @TheWireMarathi @SakalMediaNews @Maharashtratim1
— Arun Pathak (@Arunpathak_In) August 24, 2021
"రోడ్డు పక్కన పర్స్‌లు కొట్టుకుని, టికెట్లు అమ్ముకుని బతికే నారాయణ్ రాణెకు శివసేన, బాలాసాహెబ్ రాజకీయ భిక్ష పెట్టారు. ప్రస్తుతం ఆయన అవి మర్చిపోయి హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. బాలాసాహెబ్ కుమారుడు, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపైనే విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారికి శిరచ్ఛేదనం చేయాలి. ఈ పని ఎవరు చేసిన వారికి రూ. 51 లక్షలు ఇస్తాను."
- అరుణ్ పాఠక్, విశ్వ హిందూసేన జాతీయ అధ్యక్షుడు
నారాయణ్ రాణె చనిపోయిన తరువాత ఆయన అస్తికలను కాశీలో కలిపేందుకు తాను ఏమాత్రం అంగీకరించనని పాఠక్ ట్వీట్ చేశారు. దీంతో రాణె ఆత్మ ఏళ్ల తరబడి ఇక్కడే తిరుగుతూ ఉంటుందని అన్నారు.
మంత్రి వ్యాఖ్యలతో...
దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని కేంద్రమంత్రి రాణె ఇటీవల వ్యాఖ్యానించారు. రాణె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో శివసేన కార్యకర్తలు రాణెపై నాసిక్‌సహా పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భాజపా చేపట్టిన జన్ ఆశిర్వాద్ కార్యక్రమం కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న రాణెను రత్నగిరి ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాణేకు రాయ్‌గఢ్‌లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ బాంబే హైకోర్టును కేంద్ర మంత్రి రాణె ఆశ్రయించారు. ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని బాంబే హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: Narayan Rane news: 'ఇకపై మంచి పదాలతో విమర్శిస్తా..'