ETV Bharat / bharat

అసోం సీఎం ఎవరు? ఉత్కంఠకు తెరపడేనా? - అసోం భాజపా

అసోం సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సర్బానంద సోనోవాల్​, హిమంత బిశ్వశర్మల మధ్య గట్టి పోటీ నెలకొన్న వేళ.. రాష్ట్ర రాజకీయాలు దిల్లీ చేరాయి. పలు దఫాలుగా చర్చలు జరిగినా.. ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ విషయంపై భాజపా శాసనసభాపక్ష భేటీ ఆదివారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంతో సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాలు భావిస్తున్నాయి.

Assam election
అసోం ఎన్నికలు
author img

By

Published : May 8, 2021, 4:14 PM IST

Updated : May 8, 2021, 5:15 PM IST

అసోం సీఎం ఎవరు?.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం. ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వెల్లడించినా.. సీఎం ఎవరనే విషయంలో స్పష్టత లేని కారణంగా వాయిదా పడింది.

126 స్థానాలు కలిగిన అసోం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని భాజపా 60 స్థానాలు, ఏజీపీ 9, యూపీపీఎల్​ ఆరు సీట్లు గెలుపొందాయి. ఫలితాలు వెలువడి వారం రోజులకుపైగా గడుస్తున్నప్పటికీ సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

కీలక నేతల మధ్య గట్టి పోటీ?

sarbananda, Himantha
సోనోవాల్​, హిమంత బిశ్వ శర్మ

అసోం ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని మిత్రజోన్​ కూటమి ఘన విజయ సాధించింది. అయితే.. ముఖ్యమంత్రి పదవి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సీఎం శర్బానంద సోనోవాల్​, పార్టీ కీలక నేత హిమంత బిశ్వశర్మ మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యమంత్రిగా శర్బానంద పేరును అధిష్టానం ప్రకటించకపోయినప్పటికీ.. పార్టీ విజయం సాధించటంలో కీలకంగా వ్యవహరించినట్లు అధిష్ఠానం భావిస్తోంది. మరోవైపు.. ఈశాన్య రాష్ట్రాల ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్​ హోదాలో ఈ ప్రాంతంలో సంక్షోభ పరిష్కర్తగా హిమంత బిశ్వశర్మకు మంచి పేరు ఉంది. ప్రధాని మోదీ, అమిత్​ షాలకు ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఇద్దరి నేతల్లో ఎవరి పేరును ఖరారు చేస్తారోనని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

దిల్లీ చేరిన రాజకీయాలు..

Assam election
నడ్డాను కలిసిన ఇరువురు నేతలు

సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​, కీలక నేత హిమంత బిశ్వశ్వర్మలు దిల్లీకి రావాలని శనివారం ఆదేశించింది కేంద్ర నాయకత్వం. ఈ క్రమంలో దిల్లీలో.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు ఇరువురు నేతలు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సహా పార్టీ సీనియర్​ నేతలు హాజరయ్యారు. ఇరువురు నేతలతో విడివిడిగా రెండు రౌడ్లు సమావేశమయ్యారు నేతలు. మూడో దఫాలో ఇరువురి నేతలతో కలిసి చర్చించారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఆదివారం భాజపా శాసనసభాపక్ష భేటీ!

అసోం ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై తేల్చేందుకు ఆదివారం భాజపా శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అధిష్టానం. ఈ మేరకు దిల్లీ నేతలతో భేటీ అనంతరం హిమంత శర్మ వెల్లడించారు. గువాహటిలో ఆదివారం ఈ సమావేశం జరుగుతుందని.. అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని ఆయన వివరించారు.

అయితే ఈసారైనా సీఎం ఎవరనేది తేలుతుందా? లేక మరోసారి ఈ అంశాన్ని సాగదీస్తారా? అనేది ఆదివారం తేలనుంది.

ఇదీ చూడండి: అసోంలో సీఎం పీఠం ఎవరికి.?

Last Updated : May 8, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.