ETV Bharat / bharat

Himachal Pradesh Floods : హిమాచల్​లో వర్షాల బీభత్సం.. ఒక్కరోజులోనే 55 మంది మృతి - హిమాచల్​ ప్రదేశ్​ ఫొటోలు

Himachal Pradesh Floods Update : హిమాచల్ ప్రదేశ్​లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో దాదాపు 55 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు కూలిపోయాయి. కొండచరియల శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. వందల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్​ సింగ్​ సుఖు తెలిపారు.

Himachal Pradesh Floods Update
Himachal Pradesh Floods Update
author img

By

Published : Aug 14, 2023, 4:22 PM IST

Updated : Aug 14, 2023, 8:28 PM IST

Himachal Pradesh Floods Update : హిమాచల్​ ప్రదేశ్​లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 55 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రోడ్లపై కొండచరియలు విరిగిపడటం వల్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లు కూలిపోయాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు, రాష్ట్రంలో ఆగస్టు15వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం లేదని సీఎం సుఖ్వీందర్​ సింగ్​ సుఖు తెలిపారు.

కూలిన శివాలయం.. 9 మంది మృతి..
Himachal Pradesh Floods Death : హిమాచల్​ ప్రదేశ్​ రాజధాని శిమ్లా సమ్మర్​ హిల్​లో ఉన్న ఓ శివాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి సుఖ్వీందర్​ సింగ్​ సుఖు సందర్శించారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని తెలిపారు. శిథిలాల కింది నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు తెలిపారు. మరో 12 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారని.. వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు. శిమ్లా సమీపంలోని ఫగ్లీ ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడి అనేక ఇళ్లు బురదలో కూరుకుపోయాని ముఖ్యమంత్రి తెలిపారు.

  • Disturbing visuals have emerged from Sambhal, Pandoh - District Mandi, where, as reported, seven individuals have been swept away by flash floods today.

    Active rescue, search, and relief operations are currently in progress to address this dreadful situation. pic.twitter.com/OLgZGgXNlF

    — Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సోమవారం మూతపడ్డాయి. ఈ విపత్తు కారణంగా ముఖ్యమైన శిమ్లా-చండీగఢ్ రహదారితో సహా 752 రోడ్లను మూసేశామని రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్​ తెలిపింది.

ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి..
సోలన్​ జిల్లాలోని జాడోన్​ గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో సహాయక సబ్బంది ఆరుగురిని రక్షించారు. ఒకే కుటుంబానికి చెందిన మరో ఏడుగురు చనిపోయారు. మృతులను హర్నం (38), కమల్ కిశోర్ (35), హేమలత (34), రాహుల్ (14), నేహా (12), గోలు (8), రక్ష (12)గా గురించినట్లు సోలన్‌ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ సింగ్‌గా వివరాలు వెల్లడించారు.
బలెరా గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. రామ్​షెహర్​ మండలంలోని బనాల్​ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఓ మహిళ చనిపోయిందని సోలన్ డిప్యూటీ కమిషనర్ మన్మోహన్ శర్మ తెలిపారు.

Himachal Pradesh Floods Update
విరిగిపడ్డ కొండచరియలు.. కూలిన ఇల్లు

Himachal Pradesh Heavy Rainfall : హమీర్​పుర్​ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ముగ్గురు చనిపోయారని, ఇద్దరు గల్లంతయ్యారని డిప్యూటీ కమిషనర్ హేమ్​రాజ్​ బైర్వా తెలిపారు. రంగస్​ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో ఇల్లు కూలి ఓ మహిళ చనిపోయిందని తెలిపారు. జిల్లా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Himachal Pradesh Floods Update
సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందం

మండి జిల్లాలోని సెగ్లీ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు.
Himachal Pradesh Rain Forecast : మంగళవారం కూడా భారీ వర్షాల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 18 వరకు రాష్ట్రంలో తడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

వరద గుప్పిట్లో హిమాచల్​.. 17 మంది మృతి.. రూ.3వేల కోట్ల నష్టం.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

హిమాచల్​లో వరద బీభత్సం.. రూ.780కోట్ల ఆస్తి నష్టం

Last Updated : Aug 14, 2023, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.