ETV Bharat / bharat

ఎన్నికల సిబ్బందికి కొండంత కష్టం.. పోలింగ్​ కేంద్రానికి 20 కిలోమీటర్లు నడక!

ఈ నెల 12న హిమాచల్ ​ప్రదేశ్​లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్​ బూత్​లకు వెళ్లాలంటే సిబ్బంది.. దాదాపు 20 కిలోమీటర్లు దూరం నడవాల్సిందేనట.

Himachal assembly election
హిమాచల్​ప్రదేశ్​లో పోలింగ్​ సిబ్బందికి కష్టాలు
author img

By

Published : Nov 1, 2022, 6:07 PM IST

పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే హిమాచల్​ ప్రదేశ్​లో శాసనసభ ఎన్నికల నిర్వహణ.. పోలింగ్ సిబ్బంది పెను సవాల్​గా మారింది. కొన్ని ఓటింగ్ కేంద్రాలు పర్వత ప్రాంతాల్లో ఉన్నందున అక్కడకు చేరుకోవడానికి.. రవాణా సౌకర్యం లేక సిబ్బందికి కాలినడకే ఆధారమవుతుంది. కులు జిల్లాలోని మూడు పోలింగ్​ బూత్​లలో ఎన్నికల నిర్వహించాలంటే.. సిబ్బంది దాదాపు 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.

కులు జిల్లా బంజర్​ నియోజకవర్గంలోని గడపర్లీ పంచాయితీలోని శక్తి, టోర్షన్​ పోలింగ్​ బూత్​లు, కులు ప్రాంతంలోని మణికర్ణా పంచాయితీలకు కాలినడకనే వెళ్లాలి. ఎందుకంటే ఆ ప్రాంతాలకు చేరుకోవడానికి వేరే మార్గం లేదు. దానికోసం ఎన్నికల సిబ్బంది దాదాపు 20 కిలోమీటర్లు మేర నడవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. శక్తి, టోర్షన్​ ప్రాంతల్లో మొత్తం 98 మంది తమ ఓటు హక్కును వినియోగించనున్నారు. అయితే ఈ ప్రాంతంలోని గ్రామస్థులంతా పూర్తిగా సౌరశక్తిపైనే ఆధారపడి ఉన్నందున అక్కడ సిబ్బందికి.. మొబైల్​ నెట్​వర్క్​, విద్యుత్​ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ మూడు పోలింగ్ బూత్​లలో ఎన్నికలు నిర్వహించేందుకు రెండు రోజుల ముందుగానే పోలింగ్ సామగ్రితో సిబ్బంది బయలుదేరతారని.. బంజర్ సబ్ డివిజనల్ అధికారి ప్రకాశ్ చంద్ ఆజాద్ వెల్లడించారు. కులు జిల్లాలోని మొత్తం 35 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. అయితే.. సిబ్బంది మూడు స్టేషన్లకు చేరుకోవడానికి ఐదు కిలోమీటర్లు.. మరో తొమ్మిది పోలింగ్ కేంద్రాలకు దాదాపు ఏడు కిలోమీటర్ల వరకు కాలినడకన వెళ్లాల్సి ఉంటుందని సబ్​ డివిజనల్​ అధికారి తెలిపారు.

విధి నిర్వహణ కోసం పోలింగ్​ సిబ్బంది ఇలా కిలోమీటర్ల కొద్దీ నడిచేందుకు సిద్ధమవుతుండగా.. దేశంలోనే తొలి ఓటరుగా పేరు గాంచిన వృద్ధుడు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసేందుకు సిద్ధమయ్యారు. హిమాచల్​ప్రదేశ్​కు చెందిన 106 ఏళ్ల శ్యాం సరన్​ నేగి.. దేశంలోని అత్యంత వయస్కుడైన ఓటరుగా రికార్డు నమోదు చేశారు. అయితే.. వృద్ధాప్యం కారణంగా ప్రభుత్వం ఆయనకు పోస్టల్​ బ్యాలెట్​ సదుపాయం కల్పించినా.. నేగి నిరాకరించారు. తాను స్వయంగా పోలింగ్​ బూత్​కు వెళ్లే ఓటు హక్కు వినియోగించుకుంటానని స్పష్టం చేశారు. ఆయన కథ ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.