ETV Bharat / bharat

'కరోనా భయాలతోనే హజ్​కు తగ్గిన దరఖాస్తులు'

2021 హజ్​ యాత్రకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే.. కరోనా భయాలు, నూతన మార్గదర్శకాలు సహా టికెట్​ ధరల పెంపు కారణంగా యాత్రపై ఎక్కువ మంది ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. డిసెంబర్​ 10తో గడువు ముగియనుంది.

'High prices, COVID behind tepid response to Haj 2021 applications'
'కరోనా భయాలతోనే హజ్​కు తగ్గిన దరఖాస్తులు'
author img

By

Published : Nov 22, 2020, 4:28 PM IST

వయో పరిమితులు, టికెట్​ ధరల పెంపు, కరోనా వైరస్​ భయాలు హజ్​ యాత్రపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా 2021 యాత్రకు ఎక్కువ మంది ముస్లింలు ఆసక్తి చూపట్లేదని హజ్​ కమిటీ సభ్యులు చెబుతున్నారు. డిసెంబర్​ 10 వరకు గడువు ఉండగా.. దరఖాస్తులు పెద్దగా రావట్లేదని వెల్లడించారు. ఈ మేరకు వేర్వేరు రాష్ట్రాల హజ్​ కమిటీ ప్రతినిధులు ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

గతేడాది కంటే దరఖాస్తులు భారీగా తగ్గాయని, కరోనానే ఇందుకు కారణమని చెప్పారు దిల్లీ హజ్​ కమిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ అధికారి మొహ్సిన్​ అలీ.

''కరోనా కారణంగా హజ్​కు వెళ్లేందుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ధరల పెంపు కూడా మరో కారణం. ఇది గతేడాది కంటే చాలా తక్కువ. ఇప్పటివరకు దిల్లీ నుంచి 450-500 మంది మాత్రమే హజ్​ వెబ్​సైట్​ నుంచి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్​ 10 నాటికి ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం.''

- మొహ్సిన్​ అలీ, దిల్లీ హజ్​ కమిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ అధికారి

ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దాదాపు 2000 మంది యాత్రికులు హజ్​కు వెళ్లేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆ రాష్ట్ర హజ్​ కమిటీ కార్యదర్శి రాహుల్​ గుప్తా తెలిపారు.

ఇదీ చూడండి: 'యాసిడ్​ దాడి బాధితులకు పరిహారం ఇవ్వరేం?'

కరోనా దృష్ట్యా గత విధానాల్లో కొన్ని మార్పులు చేసింది భారత హజ్ కమిటీ(హెచ్​సీఐ). వయోపరిమితి, అర్హత తదితర అంశాలపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

  • 18 ఏళ్లు నిండనివారు, 65 ఏళ్లు పైబడినవారు హజ్​కు వెళ్లేందుకు అనర్హులు.
  • రూ. 81 వేల బదులు.. లక్షా 50 వేల రుసుమును వాయిదా పద్ధతిలో చెల్లించాలి.
  • భౌతిక దూరం వంటి నిబంధనల కారణంగా నిర్వహణ ఖర్చు పెంపు.
  • బస్సుల్లో పరిమిత సంఖ్యలోనే యాత్రికులకు అనుమతితో రవాణా ఖర్చులో పెంపు.

సౌదీ ప్రభుత్వం కూడా వ్యాట్​ను 5 నుంచి 15 శాతానికి పెంచింది.

సాధారణంగా.. ఏటా భారత్​ నుంచి 2 లక్షల మంది యాత్రికులు హజ్​కు వెళ్లేవారు. కరోనా కారణంగా ప్రయాణాలపై విధించిన ఆంక్షలతో ఈసారి ఆ సంఖ్యను 50 వేల మందికి పరిమితం చేసింది కేంద్రం. 2021 సంవత్సరానికి గాను జూన్​-జులై నెలల్లో హజ్​ యాత్ర ఉంటుంది. దరఖాస్తుల గడువు ఈ డిసెంబరు 10తో ముగియనుంది.

కొవిడ్​ మహమ్మారి కారణంగా.. 2020 హజ్​ యాత్రను సౌదీ సాదాసీదాగా నిర్వహించింది. తొలిసారి కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశీయులను అనుమతించలేదు.

ఇదీ చూడండి: ట్రంప్​ తీసుకున్న డ్రగ్​కు ఎఫ్​డీఏ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.