ETV Bharat / bharat

నిత్యావసరాల ధరలకు రెక్కలు.. అక్కడ ఒక గుడ్డు రూ.50 - bhutan inflation news

భూటాన్​లో ఒక్క గుడ్డు ధర రూ.50 పలుకుతోంది. కిలో మిర్చి ధర రూ.600కు పైగా చేరింది. దీంతో నిత్యావసరాలు కొనాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. మరోవైపు ఆంక్షల కారణంగా కార్మికుల కొరత ఏర్పడింది. ఫలితంగా పలు రంగాల్లో ఉత్పత్తి పడిపోయింది.

High inflation
ఒక గుడ్డు రూ.50
author img

By

Published : May 5, 2022, 9:24 PM IST

Bhutan Inflation పొరుగు దేశం భూటాన్​లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు, గుడ్ల ధరలు చరిత్రలో ఎన్నడు లేని విధంగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రజలు మిర్చి, గుడ్లు కొనాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గుడ్ల ఉత్పత్తి భారీగా పడిపోవడం వల్ల వాటి ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఒక్క గుడ్డు ధరు రూ.50గా ఉంది.

High inflation
నిత్యావసరాల ధరలకు రెక్కలు

Egg Price: నిత్యవసరాల ధరలు ఇలా ఉంటే.. భూటాన్​ ప్రభుత్వానికి మరో పెద్ద సమస్య వచ్చిపడింది. ప్రభుత్వం పెట్టిన ఏడు రోజుల క్వారంటైన్ నిబంధన కారణంగా భారత్​ నుంచి కార్మికులు ఎవరూ అక్కడకు వెళ్లడం లేదు. స్వదేశంలోనే ఇతర ప్రత్యామ్నాయ ప్రాంతాలవైపు చూస్తున్నారు. దీంతో కార్మికుల కొరత ఏర్పడింది. ఫలితంగా పలు రంగాల్లో ఉత్పత్తి పడిపోయింది. ఈ సమస్య నుంచి భయటపడటం ప్రభుత్వానికి సవాల్​గా మారింది.

High inflation
నిత్యావసరాల ధరలకు రెక్కలు

గుడ్ల కొరతను తగ్గించేందుకు భారత్​ నుంచి దిగుమతిని పెంచింది భూటాన్​. తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. గుడ్ల ఉత్పత్తి 380,2090 నుంచి 120,723కి పడిపోయిందని భూటాన్ వ్యవసాయ శాఖ వెల్లడించింది. వివిధ కారణాల వల్ల 48,000 కోళ్లు మరణించడమూ గుడ్ల కొరతకు కారణమైంది. కోడిపిల్లలు పెరిగి గుడ్లు పెట్టడానికి నాలుగైదు నెలల వరకు సమయం పడుతుంది, అప్పటివరకు డిమాండ్​కు తగ్గ సరఫరా కష్టం కానుంది. మరోవైపు మిర్చి ధర కూడా కేజీ రూ.600కు చేరింది.

High inflation
ఒక గుడ్డు రూ.50

భూటాన్​లోని జ్యూస్​, వైన్ ఫ్యాక్టరీలు, ఆర్మీ వెల్ఫేర్ ప్రాజెక్టుల్లో పని చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన వందల మంది కార్మికులు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ పనిచేసేందుకు కార్మికులే లేరు. భారత్​ నుంచి వలస వెళ్లిన కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో భూటాన్​లో కొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి ఉండే సూచనలు కన్పిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'కరోనాతో కోటిన్నర మంది మృతి'.. డబ్ల్యూహెచ్​ఓ నివేదికపై భారత్​ అసంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.