ETV Bharat / bharat

'ఆచరణ సాధ్యం కాని ఆదేశాలివ్వొద్దు' - అలహాబాదు హైకోర్టుపై సుప్రీం

ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వరాదని హైకోర్టులకు సూచించింది సుప్రీంకోర్టు. ఉత్తర్​ప్రదేశ్​ వైద్య సౌకర్యాల కల్పనపై ఇటీవలే అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది.

supreme court
సుప్రీం కోర్టు, సుప్రీం
author img

By

Published : May 22, 2021, 4:59 AM IST

Updated : May 22, 2021, 6:55 AM IST

హైకోర్టులు ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌లో వైద్య సౌకర్యాల కల్పనపై ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది.

కొద్దిరోజుల క్రితమే మేరఠ్‌లోని ఓ ఆసుపత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరిన సంతోష్‌ కుమార్‌ అనే కొవిడ్‌ బాధితుడు.. అక్కడి బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయి మృతి చెందాడు. అక్కడి వైద్య సిబ్బంది ఆయనను గుర్తించలేదు. పైగా శవాన్ని గుర్తు తెలియని మృతదేహంగా పరిగణించింది. ఈ పరిస్థితుల ఆధారంగా అలహాబాద్‌ హైకోర్టు ఇటీవలే పలు వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్‌ గ్రామీణ, చిన్న పట్టణాల వైద్య వ్యవస్ధలు 'దేవుడి దయ' మీద ఆధారపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. కొవిడ్‌ కట్టడి కోసం యూపీ ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని ప్రతి గ్రామానికి ఐసీయూ సదుపాయం ఉన్న రెండు అంబులెన్సులు, ప్రతి పట్టణానికి 20 అంబులెన్సుల చొప్పున సమకూర్చాలని ఆదేశించింది. ఐదు వైద్య కళాశాలను పీజీ వైద్య సంస్థలుగా మార్చాలని తెలిపింది.

ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ యూపీ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సమీక్షించిన సుప్రీంకోర్టు.. ఇలాంటి ఆదేశాలు ఇచ్చేటప్పుడు హైకోర్టులు అవి ఆచరణ సాధ్యమా కాదా అని పరిశీలించాలని, ఇచ్చే ముందు నిగ్రహం పాటించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది.

ఇదీ చదవండి:తమిళనాట తగ్గని కరోనా ఉద్ధృతి

Last Updated : May 22, 2021, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.