ETV Bharat / bharat

High Court on POP Ganesh Idols Immersion : పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయి: హైకోర్టు - Telangana High Court Latest News

POP ganesh idols immersion
TELANGANA HIGH COURT
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 3:11 PM IST

Updated : Sep 8, 2023, 5:29 PM IST

15:00 September 08

పీవోపీ విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గతేడాది హైకోర్టు ఉత్తర్వులు

High Court on POP Ganesh Idols Immersion : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయక విగ్రహాలను.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక కృత్రిమ కొలనుల్లోనే నిమజ్జనం (High Court on POP Ganesh Idols Immersion) చేయాలని తెలిపింది. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని పేర్కొంది. పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్ర మండలి జారీ చేసిన నిబంధనలను సవాల్ చేస్తూ.. తెలంగాణ గణేష్ మూర్తి కళాకార్ వెల్ఫేర్ అసోసియేషన్ గత సంవత్సరం వేసిన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిపింది.

POP Ganesh Idols Immersion : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులపై ఎన్జీటీ స్టే ఇచ్చిందని.. ముంబై న్యాయస్థానం మాత్రం సమర్థించిందని.. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. సీపీసీబీ నిబంధనల చట్టబద్ధతపై సెప్టెంబరు 25న విచారణ జరుపుతామని.. సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ధర్మాసనం తెలిపింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో చేయవద్దని.. ప్రత్యేక కొలనుల్లోనే చేయాలన్న గత ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని పేర్కొంది.

అయితే గతేడాది హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేశారని.. న్యాయవాది వేణుమాధవ్ హైకోర్టుకు తెలిపారు. ఈ సంవత్సరం నిమజ్జనం సందర్భంగా హుస్సేన్‌సాగర్ వద్ద కెమెరాలతో నిఘా పెట్టాలని.. న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు తెలిపింది.

మట్టి గణపయ్యా... నీకు దండాలయ్యా...

Pollution Control Board to Distribute Clay Ganesh Idols in Hyderabad : మరోవైపు వినాయక చవితి వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో . గతేడాది కంటే ఈసారి మట్టి విగ్రహాల వినియోగం పెంచేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ( Pollution Control Board ) చర్యలు చేపడుతోంది. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేలా.. ఈసారి కూడా పెద్ద ఎత్తున మట్టి విగ్రహాలు పంపిణీ చేయాలని పీసీబీ నిర్ణయం తీసుకుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు స్వస్తి పలికేలా హైదరాబాద్​లో సుమారు రెండు లక్షల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మట్టి విగ్రహాలతో పాటు.. ఉచితంగా మొక్కల పంపిణీ

Ganesh Chaturthi 2023 : హైదరాబాద్​లోని ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన పెరిగిందని పీసీబీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు.. కాలుష్యం నియంత్రణ మండలి ఆధ్వర్యంలో.. మట్టి వినాయకులను (Clay Ganesh Idols) సిద్ధం చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అధికారులు వెల్లడించారు.

Khairatabad Ganesh 2023 : మరోవైపు వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఖైరతాబాద్ గణేశుడు సిద్ధమవుతున్నాడు. వినాయక చవితి సమయం ఆసన్న కావడంతో గణనాథుడి తయారీలో ఉత్సవ సమితి వేగం పెంచింది. 68 సంవత్సరాలుగా వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ.. ఈసారి 63 అడుగల ఎత్తులో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తోంది. ప్రముఖ దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరిభట్ల విఠలశర్మ సూచన మేరకు ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని శ్రీ దశమహా విద్యాగణపతి(Sri Dasha Maha Vidya Ganapathi 2023) రూపంలో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.

Khairatabad Ganesh 2023 : నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణేశుడు.. 18 నుంచి భక్తులకు దర్శనం

మక్తాల ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ

Last Updated : Sep 8, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.