AP High Court Interim Orders in Margadarsi Case: మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థలో జరుగుతున్న సోదాలపై.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. మార్గదర్శి కార్యాలయాల్లో జరుగుతున్న తనిఖీలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి సంస్థల్లో వివిధ శాఖల అధికారులు సోదాలు చేయడాన్ని సవాలు చేస్తూ.. సంస్థ అథరైజ్డ్ సిగ్నెటరీ పి. రాజాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. సీఐడి, ఇతర అధికారులు కార్యాలయాల్లో తనిఖీలు చేయొద్దని స్పష్టం చేసింది. మార్గదర్శి రోజువారీ కార్యకలాపాలకు కూడా ఇబ్బంది కలిగించవద్దని ఆదేశించింది. అధికారులు తనిఖీలు చేయాల్సి వస్తే.. చిట్ ఫండ్ యాక్ట్ 46 ఏ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Telangana High Court Instructions to CID in Margadarsi Case: మార్గదర్శి కేసు వివరాలను మీడియాకు వెల్లడించవద్దని ఆంధ్రప్రదేశ్ CIDకి తెలంగాణ హైకోర్టు మౌఖికంగా సూచించింది. మార్గదర్శి కేసుపై.. ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఐడీని.. తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. కేసులో కౌంటర్ దాఖలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని.. మార్గదర్శి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది.
YSRCP Government Actions on Margadarsi న్యాయానికి చెల్లుచీటీ.. ‘ఈనాడు’ గొంతు నొక్కటమే అసలు ఎజెండా